'వరుణదేవా శాంతించు..' అంటూ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో మంత్రి తలసాని యాగం
- వానలు పడాలంటూ పూజలు చేయడం ఎక్కడైనా సాధారణమే
- ఆగకుండా భారీ వర్షాలు పడుతుండటంతో.. తగ్గాలంటూ పూజలు
- సికింద్రాబాద్ మహంకాళి ఆలయంలో వరుణ శాంతి యాగం
‘‘గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశాల మేరకు వరుణ దేవుడు శాంతించి వానలు తగ్గాలని సికింద్రాబాద్ లోని శ్రీ ఉజ్జయని మహంకాళి ఆలయంలో నిర్వహించిన వరుణ శాంతి యాగంలో పాల్గొనడం జరిగింది” అని ట్వీట్ లో పేర్కొన్నారు. ఈ మేరకు యాగం దృశ్యాలను, ఆలయంలో పూజలు ఫొటోలను తలసాని పోస్టు చేశారు.