Pakistan: పాకిస్థాన్‌లో దారుణం.. 16 ఏళ్ల హిందూ బాలికను అపహరించి బలవంతంగా వివాహం

 Hindu girl abducted and forcefully married to Muslim man in Pakistan
  • సింధ్ ప్రావిన్స్‌లో వారం రోజుల క్రితమే కిడ్నాప్
  • అపహరణ అనంతరం బలవంతంగా మతమార్పిడి
  • మాజీ అధ్యక్షుడి నివాసం ఎదుట హిందూ సభ్యుల ఆందోళన
  • జోక్యం చేసుకోవాలని కోరిన హిందూ సమాజం
పాకిస్థాన్‌లో ఓ హిందూ బాలికను కిడ్నాప్ చేసిన ఓ యువకుడు ఆమెను బలవంతంగా వివాహం చేసుకున్నాడు. సింధ్ ప్రావిన్స్‌లో జరిగిందీ ఘటన. 16 ఏళ్ల బాలికను తొలుత కిడ్నాప్ చేసిన యువకుడు ఆ తర్వాత ఆమెను బలవంతంగా మతం మార్పించాడు. ఆపై వివాహం చేసుకున్నాడు. 

విషయం తెలిసిన అక్కడి హిందూ సమాజం దీనిపై ఆందోళన వ్యక్తం చేసింది. నవాజ్‌షాలోని పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ నివాసం ఎదుట ఆందోళన తెలిపింది. తమకు మద్దతుగా నిలవాలని, ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని ఆయనను కోరింది. కాగా, సింధ్ ప్రావిన్స్‌లోని కాజీ అహ్మద్ నగరంలో వారం రోజుల క్రితం ఈ కిడ్నాప్ జరిగినట్టు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Pakistan
Sindh Province
Hindu Girl
Abducted

More Telugu News