Karnataka: ఇంట్లో నెమళ్లను పెంచుతున్న వ్యక్తి.. దాడి చేసి అరెస్ట్ చేసిన పోలీసులు

  • కర్ణాటకలోని కామేగౌడనహల్లిలో ఓ వ్యక్తిపై కేసు పెట్టిన ఫారెస్ట్ పోలీసులు
  • జాతీయ వన్య ప్రాణుల చట్టం ప్రకారం నెమళ్లు రక్షిత జంతువులు
  • వాటిని వేటాడటంతోపాటు అనుమతి లేకుండా పెంచుకోవడం కూడా నేరమే
  • కొన్ని రోజుల ముందు రామ చిలుకలతో జోస్యం చెబుతున్న ఏడుగురి అరెస్టు 
karnataka man arrested for raising peacocks

చట్ట విరుద్ధంగా నెమళ్లను పెంచుతున్నాడన్న కారణంతో కర్ణాటక అటవీ శాఖ పోలీసులు మంజూ నాయక్ అనే వ్యక్తిని అరెస్టు చేశారు. ఇక్కడి కామేగౌడనహల్లి గ్రామంలోని తన నివాసంలో మంజూ నాయక్ నెమళ్లను పెంచుతున్నాడన్న సమాచారంతో అధికారులు దాడి చేసి అరెస్టు చేశారు. ఒక పెద్ద నెమలిని స్వాధీనం చేసుకున్నారు. 

భారత వన్యప్రాణుల చట్టం 1972 ప్రకారం నెమళ్లు రక్షిత జంతువుల జాబితాలో ఉంటాయి. వాటిని వేటాడటం, హింసించడం, అనుమతి లేకుండా పెంచుకోవడం వంటివన్నీ నేరంగా పరిగణిస్తారు. ఈ క్రమంలోనే మంజూ నాయక్ పై కేసు పెట్టి అరెస్టు చేశామని.. కోర్టు రిమాండ్ మేరకు జైలుకు తరలించామని కర్ణాటక అటవీ శాఖ ప్రకటించింది.

ఇంతకు ముందు చిలక జోస్యుల అరెస్ట్
వన్య ప్రాణుల చట్టం ప్రకారం రామ చిలుకలు కూడా రక్షిత జంతువులే. ఇటీవల ప్రముఖ కమెడియన్ సునీల్ గ్రోవర్ ఓ చిలుక జోస్యుడి వద్ద జోస్యం చెప్పించుకుంటూ ఇన్ స్టాగ్రామ్ లో వీడియో పెట్టారు. అది చూసిన పెటా సంస్థ తమిళనాడులోని చెంగల్పట్టులో అటవీ శాఖ అధికారులకు ఫిర్యాదు చేసింది. రక్షిత జంతువులైన రామ చిలుకలను జోస్యం పేరిట బంధించి హింసిస్తున్నారని పేర్కొంది. దీనిపై స్పందించిన చెంగల్పట్టు అటవీ అధికారులు దాడులు చేసి ఏడుగురు చిలక జోస్యులను అరెస్టు చేశారు. అతిచిన్న పెట్టెల్లో రామ చిలుకలను బంధించడంతో వాటి రెక్కలు, కాళ్లు విరుగుతున్నాయని పెటా సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది.

More Telugu News