Naga Chaitanya: 'థ్యాంక్యూ' సినిమా ఎందుకు చూడాలంటే .. : దిల్ రాజు

Thank you movie update
  • విభిన్న కథా చిత్రంగా రూపొందిన 'థ్యాంక్యూ'
  • విక్రమ్ కుమార్ దర్శకత్వం వహించిన సినిమా
  • ఫీల్ కోసం ఈ సినిమా చూడాలంటున్న దిల్ రాజు 
  • ఈ నెల 22వ తేదీన సినిమా విడుదల
నాగచైతన్య హీరోగా విక్రమ్ కుమార్ రూపొందించిన 'థ్యాంక్యూ' సినిమాను దిల్ రాజు నిర్మించారు. ఈ సినిమాలో రాశి ఖన్నా .. మాళవిక నాయర్ .. అవికా కథానాయికలుగా అలరించనున్నారు. ఈ సినిమా నుంచి రీసెంట్ గా వదిలిన ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ నెల 22వ తేదీన ఈ సినిమాను విడుదల చేస్తున్నారు.

ఈ సినిమా ప్రమోషన్స్ లో దిల్ రాజు మాట్లాడుతూ .. "ఇద్దరు స్టార్ హీరోలు ఉన్న కారణంగా 'ఆర్ ఆర్ ఆర్' సినిమాను చూశారు. మాస్ యాక్షన్ విజువల్స్ కోసం 'కేజీఎఫ్ 2'ను చూశారు. అలా 'థ్యాంక్యూ' సినిమాను ఎందుకు చూడాలి? చైతూ అభిమానులు కానివారు ఈ సినిమా దేని కోసం చూడాలి? అనే ప్రశ్నకు సమాధానం ఉంది.

ఈ సినిమాను ఫీల్ కోసం చూడాలి. ఈ సినిమా చూసిన తరువాత ఆ ఫీల్ మీతో పాటు మీ ఇంటికి వస్తుంది. మీ ఎదుగుదలలో మీకు సహకరించినవారికి కాల్ చేసి మాట్లాడేలా చేస్తుంది. అలాంటి ఒక చక్కని ఫీల్ కోసం ఈ సినిమాను మళ్లీ మళ్లీ చూస్తారనే నమ్మకం ఉంది" అంటూ చెప్పుకొచ్చాడు.
Naga Chaitanya
Rashi Khanna
Thank You Movie

More Telugu News