Vaishnavtej: పవన్ బర్త్ డే రోజున మేనల్లుడి మూవీ రిలీజ్!

Ranga Ranga Vaibhavanga release date confirmed
  • ఫ్యామిలీ ఎంటర్టయినర్ గా 'రంగ రంగ వైభవంగా'
  • వైష్ణవ్ తేజ్ జోడీగా కేతిక శర్మ 
  • గిరీశాయ దర్శకత్వం.. దేవిశ్రీ సంగీతం 
  • సెప్టెంబర్ 2వ తేదీన సినిమా విడుదల
వైష్ణవ్ తేజ్ హీరోగా గిరీశాయ దర్శకత్వంలో 'రంగ రంగ వైభవంగా' సినిమా రూపొందింది. బీవీఎస్ ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకి, దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చాడు. ఈ సినిమా విడుదలకి ముస్తాబై చాలా రోజులైంది. అయితే వరుసగా పెద్ద సినిమాలు బరిలో ఉండటం వలన వెయిట్ చేస్తూ వచ్చారు.

తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను ఖరారు చేసి .. అధికారిక పోస్టర్ ను వదిలారు. సెప్టెంబర్ 2వ తేదీన ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. ఆ రోజున పవన్ పుట్టిన రోజు అనే విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన అప్ డేట్స్ చూసినవారు, కుర్రాడు పవన్ ను ఇమిటేట్ చేస్తున్నాడని చెప్పుకుంటున్నారు. 

ఇప్పుడు పవన్ పుట్టినరోజునే ఈ సినిమా రిలీజ్ పెట్టుకోవడం అంటే, అభిమానులందరి దృష్టి ఇటు మళ్లించడం కోసమే అనుకోవచ్చు. సాయితేజ్ పెద్ద మావయ్య స్టైల్ ను అనుకరిస్తూ వెళితే, వైష్ణవ్ తేజ్ చిన్నమావయ్య రూట్లో వెళ్లడం విశేషం. వైష్ణవ్ తేజ్ కి మాత్రమే కాదు .. కేతిక శర్మకి కూడా ఇది మూడో సినిమా కావడం మరో విశేషం.
Vaishnavtej
Kethika Sharma
Ranga Ranga Vaibhavanga Movie

More Telugu News