Rupavahini: కేవలం నిరసన కార్యక్రమాలే ప్రసారం చేయాలంటూ.. శ్రీలంక ప్రభుత్వ టీవీ చానల్ స్టూడియోలోకి దూసుకెళ్లిన ఆందోళనకారులు

Protesters breaks into Sri Lanka Rupavahini channel
  • శ్రీలంకలో కొనసాగుతున్న నిరసనజ్వాలలు
  • ప్రధాని కార్యాలయంలోకి చొచ్చుకెళ్లిన ఆందోళనకారులు
  • తాజాగా రూపావాహిని చానల్లో లైవ్ కు అంతరాయం
  • లైవ్ ఆపేసిన చానల్ సిబ్బంది
శ్రీలంకలో ప్రజాగ్రహం ఇంకా చల్లారలేదు. ఇవాళ ప్రధాని కార్యాలయంలోకి నిరసనకారులు చొచ్చుకురావడం తెలిసిందే. తాజాగా, ఆందోళనకారులు శ్రీలంక ప్రభుత్వ టీవీ చానల్ రూపావాహిని స్టూడియోలోకి దూసుకెళ్లారు. ఆ సమయంలో లైవ్ వస్తుండగా, వారు అడ్డుకున్నారు. కేవలం తమ నిరసనలకు సంబంధించిన కార్యక్రమాలనే ప్రసారం చేయాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. లైవ్ లో తమ బాణీ వినిపించే ప్రయత్నం చేశారు. ఇదంతా లైవ్ లో దర్శనమిచ్చింది. 

దాంతో రూపావాహిని చానల్ సిబ్బంది వెంటనే లైవ్ ఆపేసి, ఓ రికార్డెడ్ ప్రోగ్రామ్ ను ప్రసారం చేశారు. కాగా, శ్రీలంక రాజకీయ సంక్షోభంపై స్పీకర్ మహీంద యాపా అభేవర్ధనే స్పందించారు. మాటకు కట్టుబడి దేశాధ్యక్షుడు గొటబాయ రాజపక్స ఇవాళ రాజీనామా చేస్తారని అభేవర్ధనే వెల్లడించారు. ఈ క్రమంలో శ్రీలంక తాత్కాలిక అధ్యక్షునిగా ప్రధాని రణిల్ విక్రమసింఘే నియమితులయ్యారని తెలిపారు.
Rupavahini
TV Channel
Protesters
Sri Lanka

More Telugu News