Draupadi Murmu: ద్రౌపది ముర్ము నోట అల్లూరి సీతారామరాజు, ఎన్టీఆర్ మాట!

Draupadi Murmu tributes to tdp founder ntr in the ysrcp meeting
  • ఏపీ ప్ర‌జా ప్ర‌తినిధుల మ‌ద్ద‌తు కోరేందుకు విజ‌యవాడ వ‌చ్చిన ముర్ము
  • ముర్మును వైసీపీ ఎమ్మెల్యేల వ‌ద్ద‌కు తీసుకెళ్లిన జ‌గ‌న్‌
  • తెలుగు క‌వుల‌ను స్మ‌రించుకున్న ఎన్డీఏ రాష్ట్రప‌తి అభ్య‌ర్థి
రాష్ట్రప‌తి ఎన్నిక‌ల్లో అధికార ఎన్డీఏ అభ్య‌ర్థిగా బ‌రిలోకి దిగిన ద్రౌప‌ది ముర్ము ఏపీ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా మంగ‌ళ‌వారం ఓ ఆస‌క్తిక‌ర ఘ‌ట‌న చోటుచేసుకుంది. వైసీపీ వేదిక మీద ఆమె టీడీపీ వ్య‌వ‌స్థాప‌కుడు నంద‌మూరి తార‌క‌రామారావుకు నివాళి అర్పించారు. మ‌న్యం వీరుడు అల్లూరి సీతారామ‌రాజుతో పాటు ఎన్టీఆర్‌కు ముర్ము నివాళి అర్పించారు. 

ఏపీకి చెందిన ప్ర‌జా ప్ర‌తినిధుల‌తో స‌మావేశం కోసం విజ‌య‌వాడ‌కు వ‌చ్చిన ముర్మును ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి దంప‌తులు ఘ‌నంగా స‌త్క‌రించారు. అనంత‌రం మంగ‌ళ‌గిరిలోని సీకే క‌న్వెన్ష‌న్లో ఏర్పాటు చేసిన త‌మ పార్టీ ప్రజా ప్ర‌తినిధుల స‌మావేశానికి ముర్మును జ‌గ‌న్ తీసుకెళ్లారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడిన ముర్ము... తెలుగు క‌వులు న‌న్న‌య‌, తిక్క‌న‌, ఎర్రాప్ర‌గ‌డ‌ల‌ను స్మ‌రించుకున్నారు. అనంతరం అల్లూరి సీతారామారాజు, ఎన్టీఆర్‌ల‌కు నివాళి అర్పిస్తున్న‌ట్లు ఆమె తెలిపారు.
Draupadi Murmu
NDA
YSRCP
YS Jagan
TDP
NTR

More Telugu News