Jayamangala Venkataramana: రోడ్లు చేపల చెరువుల్లా ఉన్నాయని రోడ్డుపై చేపపిల్లల్ని వదిలిన మాజీ ఎమ్మెల్యే వెంకటరమణ... వీడియో ఇదిగో!

TDP Leaders protests on water logged roads in Kaikaluru constituency
  • ఏపీలో భారీ వర్షాలు
  • కొన్నిచోట్ల రోడ్ల పరిస్థితి దుర్భరం
  • నీళ్లు నిలిచిపోయిన వైనం
  • రోడ్లు చేపల చెరువుల్లా ఉన్నాయన్న వెంకటరమణ
ఏపీలో వర్షాలు కురుస్తుండడంతో పలు చోట్ల రోడ్ల పరిస్థితి మరీ దిగజారింది. రోడ్లపై భారీ గుంతలు ఏర్పడి, నీళ్లు నిలిచిపోయాయి. దీనిపై వైసీపీ ప్రభుత్వాన్ని విపక్షాలు నిలదీస్తున్నాయి. తాజాగా, కైకలూరు నియోజకవర్గంలో రోడ్లు చేపల చెరువుల్లా మారాయంటూ టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణ నిరసన చేపట్టారు. టీడీపీ కార్యకర్తలతో కలిసి ఆయన కైకలూరు నియోజకవర్గంలోని ఓ రోడ్డుపై నీరు నిలిచిన గుంతల్లో చేపపిల్లల్ని వదిలారు. ఈ సందర్భంగా టీడీపీ శ్రేణులు నినాదాలు చేశాయి. వీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తోంది.
Jayamangala Venkataramana
Fish Seed
Roads
Kaikaluru
TDP

More Telugu News