YSRCP: తిరుమల వెంక‌న్న సేవ‌లో కొడాలి నాని!... ఏమి కొరుకున్నారంటే..!

kodali nani visits tirumala sri venkateswara swamy
  • తిరుమ‌ల‌లో గుడివాడ ఎమ్మెల్యే నాని
  • వెంక‌న్న‌కు త‌లనీలాలు స‌మ‌ర్పించిన మాజీ మంత్రి
  • రాష్ట్ర ప్ర‌జ‌లు, జ‌గ‌న్ బాగుండాల‌ని కోరుకున్నాన‌ని వెల్ల‌డి
ఏపీలో అధికార పార్టీ వైసీపీలో కీల‌క నేత‌, మాజీ మంత్రి కొడాలి నాని మంగ‌ళ‌వారం తిరుమ‌ల శ్రీవేంకటేశ్వ‌ర స్వామిని ద‌ర్శించుకున్నారు. స్వామి వారికి త‌ల‌నీనాలు స‌మ‌ర్పించిన నాని... అనంత‌రం స్వామి వారిని ద‌ర్శించుకున్నారు.

ఈ సంద‌ర్భంగా స్వామి వారి ద‌ర్శ‌నానంత‌రం ఆల‌యం వెలుప‌ల ఆయ‌న మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్ర‌జానీకంతో పాటుగా ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి బాగుండాల‌ని తాను స్వామి వారిని కోరుకున్నాన‌ని కొడాలి నాని తెలిపారు.
YSRCP
Kodali Nani
Tirumala
YS Jagan

More Telugu News