బండి సంజయ్‌కు బర్త్ డే విషెస్ చెప్పిన కేసీఆర్... సీఎంకు థ్యాంక్స్ చెప్పిన బీజేపీ ఎంపీ
- బర్త్ డే సందర్భంగా బండి సంజయ్‌కి విషెస్ వెల్లువ
- నిండు నూరేళ్లు ప్రజలకు సేవ చేయాలన్న కేసీఆర్
- కేసీఆర్‌కు ధన్యవాదాలు చెబుతూ బండి సంజయ్ ట్వీట్
కేసీఆర్ గ్రీటింగ్స్‌కు స్పందించిన బండి సంజయ్... సీఎంకు ధన్యవాదాలు తెలుపుతూ సోషల్ మీడియా వేదికగా ఓ ట్వీట్ చేశారు. "నా పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు అందజేసిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు" అంటూ సదరు ట్వీట్లో బండి సంజయ్ పేర్కొన్నారు.