West Bengal: పాతికేళ్ల వ‌య‌సులో రాయ‌ల్ బెంగాల్ టైగ‌ర్ మృతి.. దేశంలోనే అతి పెద్ద వ‌య‌సున్న పులికి నివాళి

One of the oldest tigers in the country Raja passed away at the age of 25
  • జ‌ల్దాపారాలోని రెస్క్యూ సెంట‌ర్‌లో రాజా మృతి
  • పుష్ఫ గుచ్చాలు ఉంచి నివాళి అర్పించిన అధికారులు
  • రాయ‌ల్ బెంగాల్ టైగ‌ర్ల‌లో అతి పెద్ద వ‌యస్సున్న పులిగా ధ్రువీకరణ ‌
ప్ర‌పంచంలోని పులి జాతుల్లోకెల్లా రాయ‌ల్ బెంగాల్ టైగ‌ర్‌కు ఉన్న గుర్తింపు ప్ర‌త్యేక‌మైన‌ది. అలాంటి జాతిలోనే అతి పెద్ద వ‌య‌సు క‌లిగిన పులుల్లో ఒక‌టిగా గుర్తింపు ద‌క్కిన రాయ‌ల్ బెంగాల్ టైగ‌ర్ రాజా సోమ‌వారం మృతి చెందింది. ప‌శ్చిమ బెంగాల్‌లోని జ‌ల్దాపారాలోని రెస్క్యూ సెంట‌ర్‌లో రాజా మృతి చెందిన‌ట్టుగా అధికారులు ప్ర‌క‌టించారు. 

దేశంలో అతి పెద్ద వ‌య‌సున్న పులిగా ధ్రువీక‌రించిన అధికారులు రాజా మృత‌దేహంపై పుష్ప‌గుచ్చాలు ఉంచి నివాళి అర్పించారు. ఈ వీడియోను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు. 25 ఏళ్ల వ‌య‌సులో రాజా మృతి చెందింద‌ని ఈ సంద‌ర్భంగా అధికారులు వెల్ల‌డించారు.
West Bengal
Raja
Royal Bengal Tiger

More Telugu News