TDP: ద్రౌప‌ది ముర్ముకే టీడీపీ మ‌ద్ద‌తు...కార‌ణ‌మేమిటో చెప్పిన చంద్ర‌బాబు

tdp supports draupadi murmu in president election
  • రాష్ట్రప‌తి ఎన్నిక‌ల్లో ఎన్డీఏ అభ్య‌ర్థిగా ద్రౌప‌ది ముర్ము
  • ఎన్నిక‌ల్లో మ‌ద్ద‌తు విష‌యంపై టీడీపీ స్ట్రాట‌జీ క‌మిటీ భేటీ
  • పార్టీ ఎమ్మెల్యేల అభిప్రాయాల‌ను సేక‌రించిన చంద్ర‌బాబు
  • సామాజిక న్యాయానికి టీడీపీ ఆది నుంచి మ‌ద్ద‌తు ఇస్తోంద‌న్న టీడీపీ అధినేత‌
రాష్ట్రప‌తి ఎన్నిక‌ల్లో అధికార ఎన్డీఏ అభ్య‌ర్థిగా పోటీ చేస్తున్న ద్రౌప‌ది ముర్ముకు మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని టీడీపీ నిర్ణ‌యించింది. ఈ మేర‌కు సోమ‌వారం మ‌ధ్యాహ్నం జ‌రిగిన పార్టీ స్ట్రాట‌జీ క‌మిటీలో టీడీపీ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. రాష్ట్రప‌తి ఎన్నిక‌ల్లో ఎవ‌రికి మ‌ద్ద‌తు ఇవ్వాల‌న్న అంశంపై ఇప్ప‌టిదాకా టీడీపీ ఎటూ తేల్చని సంగ‌తి తెలిసిందే. అయితే రాష్ట్రప‌తి ఎన్నిక‌ల పోలింగ్‌కు స‌మ‌యం ఆస‌న్న‌మవుతున్న నేప‌థ్యంలో ఈ విష‌యంపై చ‌ర్చించేందుకు పార్టీ అధినేత స్ట్రాట‌జీ క‌మిటీ భేటీని నిర్వ‌హించారు.

టీడీపీ స్ట్రాట‌జీ క‌మిటీ భేటీలో భాగంగా పార్టీ ఎమ్మెల్యేల అభిప్రాయాల‌ను సేక‌రించిన చంద్ర‌బాబు... రాష్ట్రప‌తి ఎన్నిక‌ల్లో ముర్ముకు మ‌ద్దతు ఇవ్వ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు. సామాజిక న్యాయానికి టీడీపీ ఆది నుంచి మ‌ద్ద‌తు ఇస్తోంద‌ని, ఆ మేర‌కే ముర్ముకు మ‌ద్ద‌తు ఇచ్చే దిశ‌గా నిర్ణ‌యం తీసుకున్నామ‌ని చంద్ర‌బాబు పేర్కొన్నారు.
TDP
Chandrababu
Andhra Pradesh
Draupadi Murmu
President Of India Election

More Telugu News