Andhra Pradesh: ప‌య్యావుల కేశవ్‌కు భ‌ద్ర‌త పున‌రుద్ధ‌ర‌ణ‌

ap governmenr reinstate security to payyavula keshav

  • ప‌య్యావుల‌కు 1 ప్ల‌స్ 1 భ‌ద్ర‌త‌
  • గ‌న్‌మెన్ల‌ను వెన‌క్కు పిలిచిన ప్ర‌భుత్వం
  • పాత గ‌న్‌మెన్ల స్థానంలో కొత్త గ‌న్‌మెన్ల నియామ‌కం
  • త‌న‌కేమీ స‌మాచారం రాలేదంటున్న ప‌య్యావుల‌

టీడీపీ ఉవ‌ర‌కొండ ఎమ్మెల్యే, ప్ర‌జా ప‌ద్దుల క‌మిటీ (పీఏసీ) అధ్య‌క్షుడు ప‌య్యావుల కేశ‌వ్‌కు భ‌ద్ర‌త‌ను ఉప‌సంహ‌రిస్తూ తీసుకున్న నిర్ణ‌యాన్ని ఏపీ ప్ర‌భుత్వం వెనక్కు తీసుకుంది. గ‌తంలో ఏ స్థాయిలో అయితే కేశవ్‌కు భ‌ద్ర‌త క‌ల్పిస్తున్నారో... అదే త‌ర‌హాలో భ‌ద్ర‌త‌ను పున‌రుద్ధ‌రిస్తూ ఉత్త‌ర్వులు జారీ చేసింది. 

టీడీపీ ఎమ్మెల్యేగానే కాకుండా పీఏసీ చైర్మ‌న్‌గా కూడా వ్య‌వ‌హ‌రిస్తున్న ప‌య్యావుల‌కు ప్ర‌భుత్వం ఇప్ప‌టిదాకా 1 ప్ల‌స్ 1 భ‌ద్ర‌త‌ను కొన‌సాగిస్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే ప‌య్యావుల‌కు సెక్యూరిటీగా ప‌నిచేస్తున్న గ‌న్‌మెన్ల‌ను సోమ‌వారం ఉద‌యం వెన‌క్కు పిలిచిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ప‌య్యావుల‌కు భ‌ద్ర‌త‌ను ఉప‌సంహ‌రించారంటూ పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రిగింది. సోష‌ల్ మీడియా వేదిక‌నూ ప్ర‌భుత్వ నిర్ణ‌యాన్ని వ్య‌తిరేకిస్తూ ప‌లువురు పోస్టులు పెట్టారు. ఈ వ్య‌వ‌హారంపై టీడీపీ కూడా ఘాటుగానే స్పందించింది.

అయితే, ప‌య్యావుల‌కు భ‌ద్ర‌త‌గా ప‌నిచేస్తున్న గ‌న్‌మెన్ల‌ను వెన‌క్కు పిలిచిన ప్ర‌భుత్వం... వారి స్థానంలో కొత్త గ‌న్‌మెన్ల‌ను నియ‌మించింది. ఈ వ్య‌వ‌హారంపై ఇప్ప‌టిదాకా త‌న‌కేమీ స‌మాచారం లేద‌ని ప‌య్యావుల పేర్కొన‌డం గ‌మ‌నార్హం.

More Telugu News