Xiaomi 12 Lite: ఆకర్షించే ఫీచర్లతో షావోమీ 12 లైట్ ఆవిష్కరణ

  • మూడు వేరియంట్లలో ఆవిష్కరణ
  • అన్నింటిలోనూ స్టోరేజీ సామర్థ్యం ఒక్కటే
  • ర్యామ్ సామర్థ్యాల్లో మార్పులు
  • త్వరలో భారత మార్కెట్లోకి !
Xiaomi 12 Lite with 108MP main camera 67W fast charging support launched

చైనాకు చెందిన షావోమీ తాజాగా తన మాతృదేశంలో షావోమీ 12 లైట్ సిరీస్ ఫోన్లను ఆవిష్కరించింది. ఈ ఏడాది మొదట్లో విడుదల చేసిన షావోమీ 12 ప్రో వెర్షన్ కు ఇది మారు రూపం అని భావిస్తున్నారు. 

ఇది అచ్చం ఐఫోన్ 12 మాదిరే ఉంటుంది. వెనుక కెమెరా సెటప్ కొద్దిగా మారుతుంది. షావోమీ 12 లైట్ మూడు రకాల వేరియంట్లలో లభిస్తుంది. 6జీబీ, 128 జీబీ స్టోరేజీ వేరియంట్ ధర 399 డాలర్లు (రూ.31,200). 8జీబీ, 128జీబీ స్టోరేజీ ధర రూ.449 డాలర్లు. ఇక 8జీబీ ర్యామ్ 156 జీబీ ర్యామ్ ఉన్న వేరియంట్ ధర 499 డాలర్లు. ఈ ఫోన్ త్వరలో మన మార్కెట్లకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

షావోమీ 12 లైట్ లో 6.55 అంగుళాల అమోలెడ్ డిస్ ప్లే ఉంటుంది. 120 గిగాహెర్జ్ రీఫ్రెష్ రేటుతో వస్తుంది. ముందు భాగంలో 32 మెగా పిక్సల్ కెమెరా, వెనుక భాగంలో 108 మెగా పిక్సల్ కెమెరా ఏర్పాటు చేశారు. అలాగే, మరో రెండు కెమెరాలు కూడా ఉన్నాయి. ఇమేజ్ ఎడిటింగ్ ఫీచర్ కూడా ఉంది. క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 778 చిప్ సెట్ ను ఏర్పాటు చేశారు. దీనిలో 4,300 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండగా, 67 వాట్ ఫాస్ట్ చార్జర్ తో వస్తుంది. ఛార్జింగ్ విషయంలో ఫోన్ బ్యాటరీ సున్నా నుంచి 100 శాతానికి 41 నిమిషాల్లోనే పూర్తి చేస్తుంది.


More Telugu News