Payyavula Keshav: పయ్యావుల కేశవ్ గన్ మెన్లను వెనక్కి పిలిపించిన ఏపీ ప్రభుత్వం

Ap govt withdraws gunmen to Payyavula Keshav
  • పయ్యావులకు ఇప్పటి వరకు 1 ప్లస్ 1 భద్రత
  • భద్రత తొలగింపుపై మండిపడుతున్న టీడీపీ నేతలు
  • భద్రత పెంచాలని ఇటీవలే ప్రభుత్వానికి లేఖ రాసిన పయ్యావుల

టీడీపీ కీలక నేత, పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ కు రాష్ట్ర ప్రభుత్వం భద్రతను ఉపసంహరించుకుంది. గన్ మెన్లను వెనక్కి రావాలని ఆదేశించింది. ఇప్పటి వరకు ఆయనకు 1 ప్లస్ 1 భద్రత ఉండేది. మరోవైపు పయ్యావులకు గన్ మెన్లను ఉపసంహరించడంపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. 

కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే భద్రతను తొలగించారని దుయ్యబడుతున్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రభుత్వానికి వివరణ ఇచ్చిన నేపథ్యంలోనే భద్రతను తొలగించారని అంటున్నారు. ఇంకోవైపు తనకు భద్రతను పెంచాలని ఇటీవలే ప్రభుత్వానికి పయ్యావుల లేఖ రాశారు. ఈ క్రమంలో ఆయనకు ఉన్న భద్రతను సైతం తొలగించడం గమనార్హం.

  • Loading...

More Telugu News