Novak Djokovic: వింబుల్డన్ పురుషుల సింగిల్స్ విజేత నొవాక్ జకోవిచ్... కిర్గియోస్ కు నిరాశ

  • ముగిసిన వింబుల్డన్ గ్రాండ్ స్లామ్
  • టైటిల్ నెగ్గిన డిఫెండింగ్ చాంప్
  • వరుసగా నాలుగో వింబుల్డన్ టైటిల్ నెగ్గిన జకో
  • కెరీర్ లో ఏడో వింబుల్డన్ టైటిల్
  • ఓవరాల్ గా 21 గ్రాండ్ స్లామ్ టైటిళ్లు నెగ్గిన సెర్బియా వీరుడు
Novak Djokovic wins fourth Wimbledon title in a row

వింబుల్డన్ గ్రాండ్ స్లామ్ టోర్నీలో అగ్రశ్రేణి ఆటగాడు నొవాక్ జకోవిచ్ పురుషుల సింగిల్స్ విజేతగా నిలిచాడు. ఫైనల్లో ఈ సెర్బియా యోధుడు 4-6, 6-3, 6-4, 7-6 (7-3) తేడాతో ఆస్ట్రేలియా ఆటగాడు నిక్ కిర్గియోస్ పై విజయం సాధించాడు. జకోవిచ్ తొలి సెట్ ఓడినప్పటికీ వరుసగా మూడు సెట్లు చేజిక్కించుకుని చిరస్మరణీయ రీతిలో టైటిల్ సాధించాడు. 

వింబుల్డన్ లో జకోవిచ్ కు ఇది వరుసగా నాలుగో టైటిల్. ఓవరాల్ గా ఇది 7వ వింబుల్డన్ టైటిల్. ఈ విజయం అనంతరం, జకోవిచ్ కెరీర్ లో నెగ్గిన మొత్తం గ్రాండ్ స్లామ్ టైటిళ్ల సంఖ్య 21కి పెరిగింది.

కాగా, కెరీర్ లో తొలిసారి గ్రాండ్ స్లామ్ టోర్నీలో సింగిల్స్ విభాగం ఫైనల్ చేరిన కిర్గియోస్ కు నిరాశ తప్పలేదు. తొలి సెట్ గెలిచినప్పటికీ కీలక సమయాల్లో తప్పిదాలు కిర్గియోస్ కు ప్రతికూలంగా మారాయి. మరోవైపు అనుభవజ్ఞుడైన జకోవిచ్ ఒత్తిడిని అధిగమించి మ్యాచ్ ను, టైటిల్ ను కైవసం చేసుకున్నాడు.

More Telugu News