India: శ్రీలంక ప్రజలకు మద్దతుగా నిలుస్తాం: భారత్ ప్రకటన

India says its stands for Sri Lanka people
  • ఆర్థిక, రాజకీయ సంక్షోభంలో శ్రీలంక
  • కట్టలు తెంచుకున్న ప్రజాగ్రహం
  • వీధుల్లోకి వచ్చిన ప్రజలు
  • ప్రకటన చేసిన భారత విదేశాంగ శాఖ
తీవ్ర సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకలో కొత్త ప్రభుత్వం ఏర్పడనుంది. కాగా, శ్రీలంక ప్రజలకు భారత్ మద్దతు ప్రకటించింది. సంక్షేమం, అభివృద్ధి దిశగా ప్రజాస్వామ్య విలువలతో, రాజ్యాంగ వ్యవస్థల అండతో తమ ఆశలను సాకారం చేసుకునేందుకు ఉద్యమిస్తున్న శ్రీలంక ప్రజలకు సంఘీభావం ప్రకటిస్తున్నాం అంటూ భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది. 

ఈ ఏడాది తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కుదేలైన శ్రీలంకకు ఇప్పటిదాకా 3.8 బిలియన్ డాలర్ల మేర ఆర్థికసాయం అందించినట్టు తెలిపింది. శ్రీలంకలో తాజా పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నామని వివరించింది.
India
Sri Lanka
People
Crisis

More Telugu News