Indian army: ఈద్​ సందర్భంగా బార్డర్​ లో స్వీట్లు పంచుకున్న భారత్​–పాకిస్థాన్​ సైనికులు

  indian soldiers pakistani rangers exchange sweets eid ul adha
  • గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల్లోని అంతర్జాతీయ సరిహద్దుల వద్ద స్వీట్ల పంపిణీ
  • శుభాకాంక్షలు చెప్పుకున్న ఇరు దేశాల సైనికులు
  • ఫొటోలను ట్విట్టర్ లో పోస్ట్ చేసిన గుజరాత్ బీఎస్ఎఫ్ విభాగం
‘ఈద్ ఉల్ అదా (బక్రీద్)’ సందర్భంగా భారత్, పాకిస్థాన్ సరిహద్దుల్లో జవాన్లు స్వీట్లు పంపిణీ చేసుకున్నారు. ఆదివారం గుజరాత్ లో ఒకచోట, రాజస్థాన్ లోని బర్మార్ జిల్లాలో మరో చోట భారత్–పాకిస్థాన్ అంతర్జాతీయ సరిహద్దుల వద్ద స్వీట్లు మార్చుకున్నారు. గుజరాత్ ఫ్రాంటియర్స్ కు చెందిన బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) జవాన్లు.. పాకిస్థాన్ రేంజర్లకు ఈద్ శుభాకాంక్షలు చెప్పి, స్వీట్లు అందజేశారు. గుజరాత్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ తమ ట్విట్టర్ ఖాతాలో ఈ ఫొటోలను ట్వీట్ చేసింది. 

ఇస్లాం మతస్తులు త్యాగానికి గుర్తుగా ‘ఈద్ ఉల్ అదా (బక్రీద్)’ పండుగను జరుపుకుంటారు. ఈ రోజున కొత్త వస్త్రాలు ధరించి, సామూహికంగా నమాజ్ చేస్తారు. గొర్రె పోతునుగానీ, మేక పోతునుగానీ కోసి.. దాని మాంసాన్ని పేదలకు పంచుతారు.

Indian army
Army
BSF
Border
Pakistan
Gujarat

More Telugu News