PV Prabhakar Rao: ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నా: మాజీ ప్రధాని పీవీ తనయుడు ప్రభాకర్‌రావు

coming into politics says PV Son Prabhakar Rao
  • వంగర గ్రామాన్ని సందర్శించిన తెలంగాణ కరణం నియోగి బ్రాహ్మణులు
  • ప్రభాకర్‌రావు రాజకీయాల్లో వస్తే స్వాగతిస్తామన్న హుస్నాబాద్ ఎమ్మెల్యే
  • తండ్రితో కలిసి పనిచేసిన అనుభవం ఉందన్న ప్రభాకర్‌రావు
త్వరలోనే తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నట్టు దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు తనయుడు పీవీ ప్రభాకర్‌రావు ప్రకటించారు. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని పీవీ స్వగ్రామమైన వంగర గ్రామాన్ని తెలంగాణ కరణం నియోగి బ్రాహ్మణ సంఘం సభ్యులు నిన్న సందర్శించారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుడు బండారు రాంప్రసాద్‌రావు అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. దీనికి హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ కుమార్‌తోపాటు ప్రభాకర్‌రావు హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రభాకర్‌రావు క్రియాశీల రాజకీయాల్లోకి వస్తే స్వాగతిస్తామన్నారు. అనంతరం ప్రభాకర్‌రావు మాట్లాడుతూ.. తండ్రి పీవీ తరపున ఎన్నికల్లో పనిచేసిన అనుభవం తనకు ఉందని, తప్పకుండా రాజకీయాల్లోకి వస్తానని స్పష్టం చేశారు.
PV Prabhakar Rao
PV Narasimharao
Telangana

More Telugu News