Elena Rybakina: వింబుల్డన్ మహిళల సింగిల్స్ టైటిల్ విజేత ఎలీనా రైబాకినా

Elena Rybakina wins Wimbledon womens singles title
  • ఫైనల్లో ఆన్స్ జాబెర్ పై విజయం
  • తొలి సెట్ ను కోల్పోయినా పోరాడిన రైబాకినా
  • కెరీర్ లో తొలి గ్రాండ్ స్లామ్ కైవసం
కజకిస్థాన్ భామ ఎలీనా రైబాకినా (23) వింబుల్డన్ మహిళల సింగిల్స్ టైటిల్ ను కైవసం చేసుకుంది. ఓ గ్రాండ్ స్లామ్ టోర్నీలో ఫైనల్ చేరడం ఆమెకు ఇదే తొలిసారి కాగా, అద్భుతమైన ఆటతీరుతో ట్యునీషియాకు చెందిన ఆన్స్ జాబెర్ ను ఓడించింది. జాబెర్ పై 3-6, 6-2, 6-2 తేడాతో విజయం సాధించిన రైబాకినా కెరీర్ లో తొలి గ్రాండ్ స్లామ్ టైటిల్ ను అందుకుంది. 

ఈ టైటిల్ సమరంలో తొలి సెట్ ను కోల్పోయినప్పటికీ రైబాకినా ఆత్మస్థైర్యం కోల్పోకుండా ఆడింది. వరుసగా రెండు సెట్లలో గెలిచి మ్యాచ్ ను, చాంపియన్ షిప్ ను నెగ్గింది. కాగా, వింబుల్డన్ లో పురుషుల సింగిల్స్ టైటిల్ సమరం రేపు (జులై 10) జరగనుంది. ఫైనల్లో అగ్రశ్రేణి ఆటగాడు నొవాక్ జకోవిచ్ తో ఆస్ట్రేలియా ఆటగాడు నిక్ కిర్గియోస్ తలపడనున్నాడు.
Elena Rybakina
Singles Ttile
Wimbledon
Grandslam

More Telugu News