Venkaiah Naidu: సంస్కృత భాష మన వారసత్వ సంపద: ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

Venkaiah Naidu says Sanskrit is our intangible heritage
  • బెంగళూరులో వెంకయ్యనాయుడు పర్యటన
  • కర్ణాటక సంస్కృత విశ్వవిద్యాలయం స్నాతకోత్సవానికి హాజరు
  • పలువురికి గౌరవ డాక్టరేట్ల ప్రదానం
భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఇవాళ బెంగళూరులోని కర్ణాటక సంస్కృత విశ్వవిద్యాలయం 9వ స్నాతకోత్సవం, దశవార్షికోత్సవాలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆచార్య ప్రద్యుమ్న, డాక్టర్ వీఎస్ ఇందిరమ్మ, విద్వాన్ ఉమాకాంత్ భట్ లకు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేశారు. 

ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ, సంస్కృత భాష అంతర్లీనంగా వారసత్వంగా వస్తున్న భాష అని అభివర్ణించారు. భారతదేశ ఆత్మను అర్థం చేసుకోవడానికి సంస్కృత భాష ఉపకరిస్తుందని, మనందరిని ఏకం చేసే భాష అని కీర్తించారు. మనమంతా వివిధ భాషలకు నెలవైన దేశంలో ఉన్నామని, ప్రతి భాషకు తనదైన ఔన్నత్యం, ఘనత ఉన్నాయని వివరించారు. మనం ఈ భాషా సంపదలను తప్పనిసరిగా పరిరక్షించుకోవాలని వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. మున్ముందు ఇంకా గొప్ప చరిత్ర ఆవిష్కరించాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. 

ప్రాచీన రాత ప్రతులును, శిలాశాసనాలను డిజిటలీకరణ చేయడం, వేద పఠనాన్ని రికార్డు చేయడం, పుస్తక ప్రచురణ వంటి కార్యక్రమాల ద్వారా సంస్కృత గ్రంథాలలో పొందుపరిచిన మన సంస్కృతిని కాపాడుకోవాలని వెంకయ్యనాయుడు సూచించారు.
Venkaiah Naidu
Sanskrit
Heritage
Bengaluru
Karnataka

More Telugu News