Offbeat: ఆమెకు 61.. అతడికి 24.. బిడ్డను కనాలని రూ. 1.14 కోట్లు ఖర్చుపెడుతున్నారు!

61 year old grandmother and her 24 year old husband going to have baby together
  • తన కంటే 37 ఏళ్లు చిన్నవాడిని ప్రేమించి పెళ్లి చేసుకున్న చెరిల్
  • పిల్లలు కావాలన్న కోరికతో సరోగసీని ఆశ్రయించిన జంట
  • వచ్చే ఏడాది మొదట్లో బిడ్డకు జన్మనివ్వబోతున్న సరోగసీ మహిళ
ఆమె పేరు చెరిల్ మెక్ గ్రెగర్, వయసు 61 ఏళ్లు.. అతడి పేరు క్యురన్ మెక్ కెయిన్, వయసు 24 ఏళ్లు.. ఇద్దరి మధ్య ఏకంగా 37 ఏళ్లు తేడా. ఎక్కడో పరిచయమయ్యారు. ప్రేమించుకున్నారు. గత ఏడాది సెప్టెంబర్ లో పెళ్లి కూడా చేసుకున్నారు. కానీ తమకు పిల్లలు కావాలన్న కోరిక పుట్టింది. పిల్లనో, పిల్లాడినో కనేందుకు సిద్ధమయ్యారు. కానీ ఆమెకు 61 ఏళ్లు కావడంతో పిల్లల్ని కనడం కష్టమని డాక్టర్లు తేల్చి చెప్పేశారు. దీంతో సరోగసీని ఆశ్రయించారు. ఆసుపత్రి వాళ్లే ఓ మహిళను దీనికోసం ఒప్పించి సిద్ధం చేశారు.

కోటి రూపాయలకుపైగా ఖర్చు
  • సరోగసీ కోసం చెరిల్, క్యూరన్ జంట.. ఏకంగా 1.2 లక్షల పౌండ్లు (సుమారు 1.14 కోట్ల రూపాయలు) ఖర్చు పెడుతోంది.
  • ‘‘నేను మరో పాపనో, బాబునో కనబోతున్నానంటే ఎంతో ఆనందంగా ఉంది. పుట్టబోయే బిడ్డ కోసం ఏమేం కొనాలన్నది ఇప్పటికే లిస్టు కూడా తయారు చేసుకున్నా..” అని చెరిల్ సంబరపడుతోంది.
  • ఇక క్యూరన్.. “నాకు చాలా ఉత్కంఠగా ఉంది. నా జీవితంలో దీనికోసం ఎదురుచూస్తున్నాను. నాకు ఓ కుటుంబం ఏర్పడబోతోంది..” అని చెబుతున్నాడు. వచ్చే ఏడాది మొదట్లో తమ సరోగసీ బిడ్డ జన్మిస్తుందని ఈ చిత్రమైన జంట చెబుతోంది. 
  • క్యురన్ కు ఇప్పుడు పుట్టబోయే బిడ్డనే తొలి సంతానం కాగా.. చెరిల్ కు ఇప్పటికే ఏకంగా ఏడుగురు పిల్లలు ఉన్నారు. ఆ ఏడుగురు పిల్లలకు కలిపి 17 మంది సంతానం ఉన్నారు. అంటే 17 మంది మనవళ్లు, మనవరాళ్లు ఉన్న చెరిల్ ఇప్పుడు ఇంకో బిడ్డను కనబోతోందన్నమాట.

Offbeat
Surrogacy
International

More Telugu News