Chiranjeevi: మెగాస్టార్ తో సందడి చేయడానికి దిగిపోయిన శ్రుతి హాసన్!

  • వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్న శ్రుతి హాసన్ 
  • పాన్ ఇండియా సినిమాగా చేతిలో ఉన్న 'సలార్'
  • షూటింగ్ దశలో బాలకృష్ణ 107వ సినిమా 
  • చిరంజీవి షూటింగులో ఈ రోజే జాయినైన శ్రుతి హాసన్
Valther Veerrayya movie update

ఒకానొక సమయంలో శ్రుతి హాసన్ కెరియర్ గాడి తప్పింది. ఆ విషయాన్ని ఆమె గ్రహించేసరికి ఆలస్యమైపోయింది. ఆ సమయంలో కూడా ఆమెను టాలీవుడ్ ఆదుకుంది. 'క్రాక్' సినిమా హిట్ తో కాస్త ఊపిరి పీల్చుకుంది. ఆ తరువాత ఆమెకి ప్రభాస్ సినిమా 'సలార్'లోను ఛాన్స్ దక్కింది.


ఇది పాన్ ఇండియా ప్రాజెక్టు కావడంతో, ఈ సినిమా హిట్ కొడితే మిగతా భాషల నుంచి కూడా తనకి వరుస అవకాశాలు వస్తాయనే ఆశతో ఆమె ఉంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ లోగానే శ్రుతి హాసన్ మరో రెండు భారీ ప్రాజెక్టులు పట్టేసింది. 

బాలకృష్ణ 107వ  సినిమాలో కథానాయికగా నటిస్తున్న ఆమె, చిరంజీవి 154వ సినిమాలోను చేస్తోంది. బాబీ  దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం సెట్స్  పై ఉంది. ఈ సినిమా షూటింగులో ఈ రోజు నుంచి శ్రుతి హాసన్ పాల్గొంటున్నట్టుగా చెబుతున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చుతున్న ఈ సినిమాను 'సంక్రాంతి'కి రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు.

More Telugu News