Sajjala Ramakrishna Reddy: వైఎస్ విజయమ్మ వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారు: సజ్జల రామకృష్ణారెడ్డి

Sajjala Rama Krishna Reddy fires on TDP
  • వైసీపీకి రాజీనామా చేసిన విజయమ్మ
  • కుటుంబంలోని విభేదాలే కారణమంటూ ప్రచారం
  • టీడీపీ, ఎల్లో మీడియా దిగజారుడు రాజకీయాలు చేస్తున్నాయన్న సజ్జల
వైసీపీ గౌరవ అధ్యక్షురాలి పదవితో పాటు, పార్టీ సభ్యత్వానికి వైఎస్ విజయమ్మ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. పార్టీ ప్లీనరీ సమావేశాల్లో ప్రసంగిస్తూ, తెలంగాణాలో కూతురు షర్మిలకు అండగా నిలవడం కోసం ఇక్కడ పార్టీ నుంచి తప్పుకుంటున్నానని ఆమె ప్రకటించారు. మరోవైపు కుటుంబంలో నెలకొన్న అంతర్గత విభేదాల కారణంగానే ఆమె రాజీనామా చేసినట్టు ఓ వర్గం మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఆమె చేత బలవంతంగా రాజీనామా చేయించారనే చర్చ కూడా జరుగుతోంది. 

ఈ నేపథ్యంలో వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి స్పందిస్తూ... విజయమ్మ వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ, ఎల్లో మీడియా దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నాయని చెప్పారు. వైసీపీని విమర్శించడానికి ఏమీ లేక... విజయమ్మ అంశాన్ని తెరపైకి తెస్తున్నారని దుయ్యబట్టారు. విజయమ్మ వ్యాఖ్యలపై పెడార్థాలు తీసే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. 
Sajjala Ramakrishna Reddy
YS Vijayamma
YSRCP
Telugudesam

More Telugu News