PV Sindhu: మలేషియా మాస్టర్స్ నుంచి పీవీ సింధు ఔట్

PV Sindhu out from Malasia Masters
  • తైజు యింగ్ చేతిలో ఓడిపోయిన సింధు
  • 13-21, 21-12, 12-21 తేడాతో ఓటమి
  • తైజు చేతిలో సింధు ఓడిపోవడం ఇది 17వ సారి
మలేషియా మాస్టర్స్ టోర్నీ నుంచి భారత స్టార్ షట్లర్ పీవీ సింధు నిష్క్రమించింది. ప్రపంచ నెంబర్ 2, తన చిరకాల ప్రత్యర్థి తైజు యింగ్ చేతిలో ఓటమిపాలయింది. 13-21, 21-12, 12-21 తేడాతో ఓడిపోయింది. తొలి సెట్ లో ఓడిపోయిన సింధు, రెండో సెట్ లో పుంజుకుని విజయం సాధించింది. అయితే ఫలితాన్ని నిర్ణయించే మూడో సెట్ ను తైజు కైవసం చేసుకుని, మ్యాచ్ ను గెలుచుకుంది. తైజు చేతిలో సింధు ఓడిపోవడం ఇది 17వ సారి. చివరిసారిగా 2019లో ప్రపంచ ఛాంపియన్ షిప్ లో తైజును సింధు ఓడించింది. ఆ తర్వాత ఆమెపై సింధు మళ్లీ గెలవలేకపోయింది.
PV Sindhu
Malasia Masters

More Telugu News