Pawan Kalyan: వైసీపీ నవరత్నాలపై నవ సందేహాలు వెలిబుచ్చిన పవన్ కల్యాణ్

Pawan Kalyan raises doubts about YCP Navaratna schemes
  • వైసీపీ అజెండాలో నవరత్నాలు
  • గత ఎన్నికల్లో విశేషంగా ప్రచారం
  • అమలు తీరుపై పవన్ సందేహాలు
  • ప్రత్యేక పోస్టర్ ద్వారా విమర్శలు
గత ఎన్నికల సమయంలో వైసీపీ తన అజెండాలో నవరత్నాలను ఘనంగా ప్రచారం చేసుకోవడం తెలిసిందే. దీనిపై జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ విమర్శనాత్మకంగా స్పందించారు. ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన నవరత్నాలను ఘనంగా అమలు చేశామని వైసీపీ పాలకులు ప్రజలను మభ్యపెడుతున్నారంటూ పవన్ కల్యాణ్ ధ్వజమెత్తారు. నవరత్నాల అమలు తీరుపై పవన్ కల్యాణ్ నవ సందేహాలను లేవనెత్తారు. 

ఈ మేరకు ప్రత్యేక పోస్టర్ ను రూపొందించి సోషల్ మీడియాలో పంచుకున్నారు. రైతు భరోసా, అమ్మ ఒడి, పెన్షన్లు, మద్యపాన నిషేధం, జలయజ్ఞం, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్ మెంట్, పేదలందరికీ ఇళ్లు, ఆసరా పథకాలపై పవన్ సీఎం జగన్ కు సందేహాస్త్రాలు సంధించారు.
Pawan Kalyan
Doubts
Navaratna Schemes
YSRCP
Janasena
Andhra Pradesh

More Telugu News