Revanth Reddy: రాహుల్ రాముడైతే.. నేను హనుమంతుడిని.. రావణుడులాంటి కేసీఆర్ తో యుద్ధం చేస్తా: రేవంత్ రెడ్డి

Rahul is Rama and I am Hanuman says Revanth Reddy
  • తనకు పదవి ఇచ్చినందుకు సోనియమ్మకు రుణపడి ఉంటానన్న రేవంత్ 
  • సీఎం ఎవరనేది సోనియాగాంధీ నిర్ణయిస్తారని వెల్లడి 
  • కాంగ్రెస్ ను అధికారంలోకి తెచ్చేందుకు నాయకులందరం కలిసి పని చేస్తామని వ్యాఖ్య 
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు పార్టీ నేతలందరం కలసికట్టుగా పని చేస్తామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి ఎవరనేది పార్టీ అధినేత్రి సోనియాగాంధీ నిర్ణయిస్తారని... సోనియా ఎవరి పేరును ప్రకటిస్తే, వారిని పల్లకీలో మోసుకెళ్లి ఆ కుర్చీలో కూర్చోబెడతామని చెప్పారు. తనకు ఇంత గొప్ప పదవి ఇచ్చినందుకు సోనియమ్మకు జీవితాంతం రుణపడి ఉంటానని చెప్పారు.

ఇక రాహుల్ గాంధీ రాముడైతే, తాను హనుమంతుడినని రేవంత్ అన్నారు. వానరసైన్యంలాంటి కాంగ్రెస్ కార్యకర్తల సహకారంతో రావణుడులాంటి కేసీఆర్ ను ఓడించేందుకు యుద్ధం చేస్తానని చెప్పారు. హుజూరాబాద్ ఓటమితో తాను కుంగిపోయినప్పుడు... కార్యకర్తలే తనకు అండగా నిలబడ్డారని అన్నారు. 

తన లక్కీ నంబర్ 9 అని... అందుకే 99 సీట్లతో కాంగ్రెస్ కు అధికారాన్ని ఇవ్వాలని ప్రజలను కోరుతున్నానని చెప్పారు. టీపీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతను చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడుతూ రేవంత్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమానికి పలువురు కాంగ్రెస్ నేతలు హాజరయ్యారు.
Revanth Reddy
Congress
Sonia Gandhi
Rahul Gandhi
KCR
KTR

More Telugu News