నటి సాయి పల్లవికి హైకోర్టులో ఎదురు దెబ్బ... నటి క్వాష్ పిటిషన్ కొట్టివేత
- విరాటపర్వం ప్రమోషన్ సందర్భంగా సాయిపల్లవి వివాదాస్పద వ్యాఖ్యలు
- భజరంగ్ దళ్ నేతల ఫిర్యాదుతో సుల్తాన్ బజార్ పీఎస్లో కేసు నమోదు
- గత నెల 21న సాయి పల్లవికి నోటీసులు జారీ చేసిన పోలీసులు
- నోటీసులను రద్దు చేయాలంటూ హైకోర్టులో సాయి పల్లవి పిటిషన్
ఈ కేసులో సాయి పల్లవికి సుల్తాన్ బజార్ పోలీసులు గత నెల 21న నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులను రద్దు చేయాలంటూ సాయి పల్లవి తెలంగాణ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై గురువారం విచారణ చేపట్టిన హైకోర్టు... పోలీసుల నోటీసులను రద్దు చేసేందుకు నిరాకరించింది. సాయి పల్లవి అభ్యర్థనను తిరస్కరిస్తూ ఆమె పిటిషన్ను కొట్టేసింది.