YSRCP: ఏపీ సీఎం జ‌గ‌న్ నుంచి నాకు ప్రాణ హాని!... ఎంపీలంద‌రికీ లేఖ‌లు రాసిన ర‌ఘురామ‌రాజు!

ysrcp rebel mp raghuramakrishna raju wirtes a letter to all mps over life threat from ap cm ys jagan
  • 4 పేజీల్లో లేఖ రాసిన ర‌ఘురామ‌రాజు
  • 2019 ఎన్నిక‌ల్లో వైసీపీ టికెట్ మీదే ఎంపీగా గెలిచిన రాజు
  • పోలీసులు థ‌ర్డ్ డిగ్రీ ప్ర‌యోగించార‌ని గతంలో కూడా ఎంపీలకు లేఖ‌  
ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి నుంచి త‌న‌కు ప్రాణ హాని ఉంద‌ని వైసీపీ రెబ‌ల్ ఎంపీ ర‌ఘురామ‌కృష్ణరాజు సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. ఈ మేర‌కు గురువారం ఆయ‌న త‌న‌కు పొంచి ఉన్న ముప్పును వివ‌రిస్తూ త‌న స‌హ‌చ‌ర పార్ల‌మెంటు స‌భ్యుల‌కు లేఖ రాశారు. 4 పేజీల‌ లేఖ‌లో వైసీపీ నేత‌ల‌పైనా, ప్ర‌త్యేకించి సీఎం జ‌గ‌న్‌పై ఆయ‌న ఆరోప‌ణ‌లు గుప్పించారు. 

2019 ఎన్నికల్లో వైసీపీ టికెట్‌పైనే న‌ర‌సాపురం లోక్ స‌భ స్థానం నుంచి ర‌ఘురామ‌రాజు ఎంపీగా గెలిచిన సంగ‌తి తెలిసిందే. జ‌గ‌న్ స‌ర్కారు తీసుకున్న కొన్ని నిర్ణ‌యాల‌ను విమ‌ర్శించిన నేప‌థ్యంలో పార్టీతో ఆయ‌న‌కు దూరం పెరిగిన సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో ఓ ద‌ఫా ఏపీ సీఐడీ అధికారులు త‌న‌ను అరెస్ట్ చేయ‌గా...క‌స్ట‌డీలోనే పోలీసులు త‌న‌పై థ‌ర్డ్ డిగ్రీ ప్ర‌యోగించార‌ని ర‌ఘురామ ఆరోపించారు. ఈ వ్య‌వహారంపైనా ఆయ‌న స‌హ‌చ‌ర ఎంపీల‌కు లేఖ‌లు రాసిన సంగ‌తి తెలిసిందే తాజాగా జ‌గ‌న్ నుంచి త‌న ప్రాణాల‌కు ముప్పు ఉందంటూ మ‌రోమారు ఎంపీల‌కు ర‌ఘురామ‌రాజు లేఖ రాయ‌డం ప్రాధాన్యం సంత‌రించుకుంది.
YSRCP
Raghu Rama Krishna Raju
YS Jagan
Andhra Pradesh

More Telugu News