Octopus: ఈత కొడుతూ రంగులు మార్చుకున్న ఆక్టోపస్.. అద్భుతమైన వీడియో ఇదిగో!

Colour changing Octopus video going viral

  • జంతు ప్రపంచంలో ప్రతి ఒక్కటీ అద్భుతమే
  • ప్రత్యేకమైన లక్షణాలను కలిగి ఉన్న ఎన్నో జీవులు
  • వైరల్ అవుతున్న రంగులు మార్చుకుంటున్న ఆక్టోపస్ వీడియో

మన సృష్టిలోని జంతు ప్రపంచం అంతా ఎన్నో వింతలు, అద్భుతాలతో నిండి ఉంటుంది. కోట్లాది జీవ జాతులతో నిండి ఉండే జంతు ప్రపంచంలో... ప్రతి ఒక్కటీ ఆశ్చర్యకరమే. శత్రువుల నుంచి తమను తాము కాపాడుకోవడానికి ఎన్నో జీవులకు ప్రత్యేకమైన లక్షణాలు ఉంటాయి. ఇలాంటి వాటిలో అక్టోపస్ లు కూడా ఉన్నాయి.

 సముద్రంలోని లోతైన ప్రాంతాల్లో జీవించే ఆక్టోపస్ లు తమను తాము సురక్షితంగా ఉంచుకోవడానికి రంగులు మార్చుకుంటుంటాయి. తాజాగా ఒక ఆక్టోపస్ రంగులు మార్చుకుంటూ తన చుట్టూ ఉన్న రంగుల్లో కలిసిపోయిన వీడియో ఒకటి ఇంటర్నెట్ లో వైరల్ అవుతోంది. రంగులు మార్చుకుంటున్న ఆక్టోపస్ ను చూస్తున్న వీక్షకులు 'వావ్' అంటున్నారు. ఈ వీడియోను మొజాంబిక్ తీరంలో తీశారు.

More Telugu News