శబరిమల ఆలయంలోకి వెళ్లి వార్తల్లో నిలిచిన కనకదుర్గ ఇప్పుడు రెండో వివాహం చేసుకుంది!
- 2019లో శబరిమల ఆలయంలోకి వెళ్లిన కనకదుర్గ, లాయర్ బిందు
- అదే ఏడాది భర్తతో విడాకులు తీసుకున్న కనకదుర్గ
- కామ్రేడ్ శివన్ కుట్టిని రెండో వివాహం చేసుకున్న కనకదుర్గ
అయ్యప్ప ఆలయానికి వెళ్లొచ్చిన తర్వాత కనకదుర్గ ఇంట్లో గొడవలు జరిగాయి. దీంతో, అదే ఏడాది జూన్ లో ఆమె తన భర్త నుంచి విడాకులు తీసుకుంది. ఈ క్రమంలో మావో సానుకూల అయ్యంకలి పద గ్రూపులో ఎంతో కాలంగా కామ్రేడ్ గా చేస్తున్న శివన్ కుట్టికి ఏడాది క్రితం ఆమె దగ్గరయింది. ఆ పరిచయం కాస్తా పెళ్లి వరకు దారి తీసింది. శివన్ కుట్టిని ఆమె తాజాగా పెళ్లాడింది. స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం వీరిద్దరూ పెళ్లిని రిజిస్టర్ చేసుకున్నారు. ఇంతకాలం ఒంటరిగా జీవిస్తున్న తాము, ఇప్పుడు కలిసి జీవించాలనుకుంటున్నామని శివన్ కుట్టి తెలిపారు.