డ్రమ్స్ వాయిస్తూ ఏక్ నాథ్ షిండేను ఆహ్వానించిన భార్య లత.. వీడియో వైరల్!
- సీఎం అయిన తర్వాత తొలిసారి సొంత నగరం థానేకు వచ్చిన షిండే
- ఘన స్వాగతం పలికిన భార్య లత
- షిండే రాజకీయ ఎదుగుదలలో కీలక పాత్ర పోషించిన లత
ఏక్ నాథ్ షిండే రాజకీయ ఎదుగుదలలో ఆయన భార్య లత పాత్ర ఎంతో కీలకమైనది. వీరిద్దరూ తొలిసారి కలుసుకున్నప్పుడు షిండే ఆటో డ్రైవర్ గా ఉండేవారు. వీరిద్దరికీ ముగ్గురు మగ పిల్లలు కాగా... 2000వ సంవత్సరంలో జరిగిన పడవ ప్రమాదంలో ఇద్దరు కుమారులు చనిపోయారు.
ఇక నిన్న రాత్రి 9.30 గంటల సమయంలో థానేలోని తన నివాసానికి ఏక్ నాథ్ షిండే వచ్చారు. ఈ సందర్భంగా ఆయన వాహనంపై అభిమానులు పూల జల్లు కురిపించారు. తన ప్రియతమ నేత వస్తున్న నేపథ్యంలో, భారీ వర్షం కురుస్తున్నప్పటికీ లెక్క చేయకుండా... వారంతా వర్షంలోనే తడుస్తూ ఇంటి వద్ద కొన్ని గంటల సేపు వెయిట్ చేశారు. ఈ సందర్భంగా షిండే మాట్లాడుతూ, శివసేన వ్యవస్థాపకులు బాల్ థాకరే సిద్ధాంతాలను నమ్మే వారికి న్యాయం చేసేందుకే సొంత పార్టీపై తిరుగుబాటు చేయాల్సి వచ్చిందని అన్నారు.