'ది వారియర్' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి 28 మంది కోలీవుడ్ సెలబ్రిటీలు!

The Warrior Movie Update
  • తెలుగు .. తమిళ భాషల్లో రూపొందిన 'ది వారియర్'
  • రామ్, కృతి శెట్టి నేరుగా చేసిన ఫస్టు తమిళ సినిమా  
  • ఈ నెల 14వ తేదీన భారీస్థాయిలో విడుదల
  • ఈ రోజున చెన్నైలో జరగనున్న ప్రీ రిలీజ్ ఈవెంట్
కోలీవుడ్ డైరెక్టర్స్ లో లింగుసామికి ప్రత్యేకత ఉంది. మాస్ యాక్షన్ సినిమాలకి ఆయనను కేరాఫ్ అడ్రెస్ గా చెబుతారు. అలాంటి ఆయన రామ్ హీరోగా తెలుగు .. తమిళ భాషల్లో 'ది వారియర్' సినిమాను రూపొందించాడు. శ్రీనివాస చిట్టూరి నిర్మించిన ఈ సినిమాలో కథానాయికగా కృతి శెట్టి అలరించనుంది.

ఈ నెల 14వ తేదీన ఈ సినిమాను తెలుగు .. తమిళ భాషల్లో భారీ స్థాయిలో రిలీజ్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజున చెన్నైలోని 'సత్య సినిమాస్'లో తమిళ వెర్షన్ కి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహిస్తున్నారు. సాయంత్రం 6 గంటల 30 నిమిషాల నుంచి ఈ కార్యక్రమం మొదలుకానుంది. 

ఈ వేడుకకి కోలీవుడ్ కి చెందిన 28 మంది సెలబ్రిటీలు రానున్నారు. స్టార్ హీరోలు .. హీరోయిన్లు .. దర్శక నిర్మాతలు వాళ్లలో ఉన్నారు. వాళ్ల పేర్లను ప్రకటిస్తూ ఈ సినిమా మేకర్స్ ఒక పోస్టర్ ను రిలీజ్ చేశారు. మొత్తం మీద కోలీవుడ్ లో రామ్ గ్రాండ్ గానే లాంచ్ అవుతున్నాడు. ఈ సినిమాతో అక్కడ ఆయన మార్కెట్ ఏ రేంజ్ కి వెళుతుందో చూడాలి.
Go Back to Shorts
Ram
Krithishetty
Lingusamy
The Warrior Movie

More Telugu News