N Prabhakar Reddy: తమ పిల్లలను విజయవాడ ప్రభుత్వ పాఠశాలలో చేర్పించిన శాప్ ఎండీ ప్రభాకర్‌రెడ్డి

  • విజయవాడలోని కోనేరు బసవయ్య చౌదరి జడ్పీ ఉన్నత పాఠశాలలో చేర్పించిన వైనం
  • పాపను ఆరో తరగతిలో, బాబును 8వ తరగతిలో చేర్పించిన ప్రభాకర్‌రెడ్డి భార్య
  • స్కూల్‌లో మౌలిక వసతులు బాగున్నాయని ప్రశంస
SAAP MD Prabhakar Reddy joins his children in govt high school

కాస్తంత కష్టమైనా సరే సాధ్యమైనంత వరకు తమ పిల్లలను మంచి ప్రైవేటు స్కూల్‌లో చేర్పించాలనుకుని తల్లిదండ్రులు తపన పడే ఈ రోజుల్లో ఓ ఐఏఎస్ అధికారి తన పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి అందరికీ ఆదర్శంగా నిలిచారు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (SAAP) వీసీ, ఎండీ ఎన్. ప్రభాకర్‌రెడ్డి తన ఇద్దరు పిల్లలను నిన్న విజయవాడలోని పటమట కోనేరు బసవయ్య చౌదరి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చేర్పించారు. 

ఆయన భార్య లక్ష్మి తన ఇద్దరు పిల్లలతో కలిసి స్కూలుకు వచ్చి వారిని చేర్పించారు. ప్రభాకర్‌రెడ్డి గతంలో నెల్లూరు జిల్లా జాయింట్ కలెక్టర్‌గా పనిచేసిన సమయంలోనూ పిల్లలను అక్కడి ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించారు. ఈ సందర్భంగా లక్ష్మి మాట్లాడుతూ.. కోనేరు బసవయ్య చౌదరి పాఠశాలలో మౌలిక వసతులు బాగున్నాయని, ఆటస్థలం కూడా ఉండడంతో పిల్లలను ఇక్కడ చేర్పించినట్టు చెప్పారు. పాపను ఆరో తరగతిలో, బాబును ఎనిమిదో తరగతిలో చేర్పించినట్టు చెప్పారు.

More Telugu News