YSRCP: స్కూల్ బ్యాగ్ భుజానికేసుకున్న జ‌గ‌న్‌... సెంట‌రాఫ్ అట్రాక్ష‌న్‌గా బుట్టా రేణుక‌

jagan pose to photographers with a school bag on his shoulders

  • విద్యా కానుక కింద పిల్ల‌ల‌కు కిట్లు అందించిన జ‌గ‌న్‌
  • భుజానికి కిట్ వేసుకుని పిల్ల‌లతో క‌లిసి ఫొటో దిగిన సీఎం
  • చాలా రోజుల త‌ర్వాత క‌నిపించిన క‌ర్నూలు మాజీ ఎంపీ

ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి మంగ‌ళ‌వారం క‌ర్నూలు జిల్లా ఆదోనిలో ప‌ర్య‌టించిన సంగ‌తి తెలిసిందే. జ‌గ‌నన్న విద్యా కానుక‌ కింద ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల విద్యార్థుల‌కు కిట్ల‌ను జ‌గ‌న్ అందించారు. జగనన్న విద్యా కానుక కిట్లలో 3 జతల యూనిఫారాలు (క్లాత్‌), ఒక జత బూట్లు, రెండు జతల సాక్సులు ఉంటాయి. ఇంకా బెల్టు, ఒక సెట్‌ పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాలు, స్కూల్‌ బ్యాగ్ ఉంటున్న సంగ‌తి తెలిసిందే. అన్నింటినీ బ్యాగులో పెట్టి, పిల్ల‌ల‌కు అందిస్తారు. మంగ‌ళ‌వారం ఈ కిట్ల పంపిణీని ప్రారంభించిన సీఎం పిల్ల‌ల‌కు ఇచ్చే ఓ బ్యాగును భుజానికేసుకుని ఫొటోల‌కు పోజిచ్చారు.

ఇక ఈ కార్య‌క్ర‌మంలో క‌ర్నూలు మాజీ ఎంపీ బుట్టా రేణుక సెంట‌రాఫ్ అట్రాక్ష‌న్‌గా నిలిచారు. ప్రైవేట్ విద్యా సంస్థ‌ల‌తో పాటు ప‌లు వ్యాపారాలు క‌లిగిన బుట్టా రేణుక‌... 2014 ఎన్నిక‌ల‌కు కాస్తంత ముందుగా వైసీపీలో చేరి అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేస్తూ క‌ర్నూలు ఎంపీ టికెట్‌ను సాధించారు. ఎన్నిక‌ల్లో విజ‌యం కూడా సాధించారు. అయితే 2014 ఎన్నిక‌ల్లో వైసీపీ విప‌క్షానికి ప‌రిమితం కావ‌డంతో రేణుక టీడీపీలో చేరిపోయారు. 
ఆ తర్వాత 2019 ఎన్నిక‌ల నాటికి ప‌రిస్థితిని అంచ‌నా వేసి తిరిగి వైసీపీ గూటికే చేరారు. అయితే పార్టీ కష్టాల్లో ఉన్న స‌మయంలో పార్టీని వీడిన వారికి టికెట్లు ఇచ్చేది లేద‌ని జ‌గ‌న్ చెప్పినా... సీటు ద‌క్క‌కున్నా ఫ‌రవా లేదు గానీ... పార్టీలోకి అయితే వ‌స్తానంటూ ఆమె వైసీపీలో చేరిపోయారు. 2019 ఎన్నిక‌ల నాటి నుంచి దాదాపుగా క‌నిపించ‌ని బుట్టా రేణుక మంగ‌ళ‌వారం నాటి జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న‌లో వేదిక‌పై క‌నిపించారు.

YSRCP
YS Jagan
Butta Renuka
Kurnool District
Adoni
Jagananna Vidya Kanuka
  • Loading...

More Telugu News