Thikka Reddy: 2024 ఎన్నికల తర్వాత ఇక టీడీపీ నేతలు ఆత్మహత్యలు చేసుకోవాల్సిందే: టీడీపీ నేత తిక్కారెడ్డి

TDP leaders have to suicide after 2024 elections says Thikka Reddy
  • టీడీపీ నేతలను చంద్రబాబు రోడ్డుపై వదిలేశారు
  • 2024 ఎన్నికలొస్తే అందరూ దివాళా తీస్తారు
  • నేను టీకొట్టు పెట్టుకుని బతకాల్సిందే
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, కర్నూలు జిల్లా మంత్రాలయం టీడీపీ ఇంఛార్జ్ తిక్కారెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆ పార్టీలో చర్చనీయాంశంగా మారాయి. 2024 ఎన్నికల తర్వాత తెలుగుదేశం పార్టీ నేతలు ఆత్మహత్యలు చేసుకోవాల్సిందేనని చెప్పారు. పార్టీ అధినేత చంద్రబాబు పార్టీ నేతలను రోడ్డుపై వదిలేశారని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 

తన వద్ద ఉన్న డబ్బునంతా రాజకీయాలకే ఖర్చు చేశానని... 2024 ఎన్నికలు వస్తే తన ఆస్తి మొత్తం కరిగిపోతుందని... ఆ తర్వాత తాను టీకొట్టు పెట్టుకుని బతకాల్సిందేనని చెప్పారు. రాష్ట్రంలో టీడీపీ నేతలంతా ఆస్తులు అమ్ముకున్నారని తెలిపారు. 2024 ఎన్నికలు వస్తే అందరూ దివాలా తీస్తారని చెప్పారు. ఆ తర్వాత ఇక ఆత్మహత్యలే శరణ్యమని అన్నారు. 

ఇదే సమయంలో తనపై గెలిచిన వైసీపీ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డిపై ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు. దేవుడి గదిలో దేవుడి ఫొటోలను తీసేసి జగన్ ఫొటోలను పెట్టుకున్నారని విమర్శించారు. అక్రమంగా ఇసుక అమ్ముకుంటూ బస్తాలు బస్తాలు డబ్బులు సంపాదిస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే ఎన్నికలకు వైసీపీ అధిష్ఠానం భారీగా డబ్బులు ఇస్తుందని చెప్పారు.
Thikka Reddy
Telugudesam
Chandrababu
Balanagi Reddy

More Telugu News