KTR: ముందు అహ్మదాబాద్ పేరు మార్చుకోండి.... హైదరాబాద్ పేరు మార్పు వార్తలపై కేటీఆర్ ఘాటు స్పందన

  • హైదరాబాదులో బీజేపీ జాతీయ సమావేశాలు
  • హైదరాబాదును భాగ్యనగర్ గా పేర్కొన్న మోదీ
  • మరింత క్లారిటీ ఇచ్చిన బీజేపీ నేత రఘుబర్ దాస్
  • తెలంగాణలో తాము అధికారంలోకి వస్తే పేరుమార్చుతామని వెల్లడి
KTR sharp reaction on Hyderabad name change issue

ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ ను భాగ్యనగర్ అని పిలవడం, తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే పేరు మార్చుతామని పార్టీ నేత, ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి రఘుబర్ దాస్ వ్యాఖ్యానించడం తీవ్ర చర్చకు దారితీసింది. దీనిపై తెలంగాణ మంత్రి కేటీఆర్ ఘాటుగా స్పందించారు. "ముందు అహ్మదాబాద్ పేరును 'అదానీబాద్' అని మార్చుకోండి. అసలెవరండీ ఈ గాలిమాటల జీవి?" అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. 

నిన్న హైదరాబాద్ లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగ్గా, ప్రధాని మోదీ మాట్లాడుతూ, నాడు సర్దార్ వల్లభాయ్ పటేల్ ఈ భాగ్యనగర్ నుంచే భారత్ ఏకీకరణ కార్యక్రమం షురూ చేశారని వివరించారు. అదే స్ఫూర్తిని బీజేపీ ముందుకు తీసుకెళుతుందని అన్నారు. దాంతో, ఇతర బీజేపీ నేతల నోట వెంట కూడా భాగ్యనగర్ పదం తరచుగా వినపడింది.

More Telugu News