Lawrence: అటు 'రుద్రన్' .. ఇటు 'చంద్రముఖి 2'

lawrence upcoming movies
  • తెలుగు .. తమిళ భాషల్లో లారెన్స్ కి మంచి క్రేజ్
  • షూటింగు దశలో ఉన్న 'రుద్రన్'
  • డిసెంబర్ 23వ తేదీన భారీ రిలీజ్ 
  • రీసెంట్ గా సెట్స్  పైకి వెళ్లిన 'చంద్రముఖి 2'
లారెన్స్ కి తెలుగు .. తమిళ భాషల్లో మంచి క్రేజ్ ఉంది. డాన్స్ మాస్టర్ గా .. నటుడిగా .. దర్శక నిర్మాతగా ఆయన సక్సెస్ అయ్యాడు. ఆయన నుంచి వచ్చిన 'కాంచన' .. 'గంగ' సినిమాలు, హారర్ కామెడీ జోనర్లో అత్యధిక వసూళ్లను రాబట్టాయి. ఈ  సినిమాలు టీవీలో ఎన్నిసార్లు ప్రసారమైనా మంచి రేటింగును రాబడుతున్నాయి. 

హారర్  థ్రిల్లర్ జోనర్లో 'శివలింగ' తరువాత లారెన్స్ నుంచి తెలుగు ప్రేక్షకుల ముందుకు మరో సినిమా రాలేదు. కారమణమేదైనా ఆయన సినిమాల మధ్య గ్యాప్ వచ్చేసింది. ఈ సారి మాత్రం ఆయన పెద్దగా గ్యాప్ లేకుండా రెండు సినిమాలను వదలడానికి రెడీ అవుతున్నాడు .. అందులో ఒకటి 'రుద్రన్'.

కథిరేసన్ దర్శకత్వంలో .. ఫైవ్ స్టార్ క్రియేషన్స్ బ్యానర్ పై లారెన్స్ 'రుద్రన్' అనే సినిమా చేస్తున్నాడు. నిన్న వదిలిన లారెన్స్ సెకండ్ లుక్ కి కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది. ప్రియాభవాని శంకర్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాను ఈ డిసెంబర్ 23వ తేదీన రిలీజ్ చేయనున్నారు. ఇక పి. వాసు దర్శకత్వంలో ఆయన చేస్తున్న 'చంద్రముఖి 2' వచ్చే ఏడాది ప్రథమార్థంలో ప్రేక్షకులను పలకరించనుంది.
Lawrence
Priyabhavani Shankar
Rudran Movie

More Telugu News