Madhya Pradesh: భార్యతో అసహజ శృంగారం.. ఆపై కోటి రూపాయలు ఇవ్వాలని డిమాండ్

Husband and in laws booked for unnatural sex
  • మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఘటన
  • నగ్న వీడియోలను సోషల్ మీడియాలో పెడతానని బెదిరిస్తున్నాడంటూ ఫిర్యాదు
  • అత్తమామలు కూడా అతడికే వత్తాసు పలుకుతున్నారంటూ కేసు
భార్యతో అసహజ శృంగారానికి పాల్పడడమే కాకుండా, వీడియోలు తీసి కోటి రూపాయలు ఇవ్వాలని బెదిరిస్తున్న భర్తపై అతడి భార్య (30) పోలీసులకు ఫిర్యాదు చేసింది. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో జరిగిందీ ఘటన. కోటి రూపాయలు ఇవ్వకుంటే తన నగ్న వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పెడతానని బెదరిస్తున్నాడంటూ లసుడియా పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో బాధిత భార్య పేర్కొంది. 

తన అత్తమామలు కూడా అతడికే మద్దతు పలుకుతున్నారని, అదనపు కట్నం కోసం వేధిస్తున్నారని ఆరోపిస్తూ వారిపైనా కేసు పెట్టింది. బాధిత మహిళ భర్త కాన్పూరుకు చెందిన వాడు కావడంతో ఇండోర్ పోలీసులు ఈ కేసును అక్కడికి బదిలీ చేశారు. కాగా, బాధిత మహిళ భర్త రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి అని పోలీసులు తెలిపారు.
Madhya Pradesh
Indore
Wife
Unnatural Sex

More Telugu News