UK: మన డోలు చప్పుళ్లకు బ్రిటన్​ కాలేజీ స్టూడెంట్​ అదిరిపోయే స్టెప్పులు... వీడియో వైరల్​

  • బ్రిటన్ లోని ఓ కాలేజీ సాంస్కృతిక దినోత్సవంలో పాల్గొన వివిధ దేశస్తులు
  • డోలు చప్పుడు మొదలవగానే డ్యాన్స్ అందుకున్న ఆంగ్ల విద్యార్థి
  • టిక్ టాక్ లో వచ్చిన వీడియోను ట్విట్టర్ లో షేర్ చేసిన జర్నలిస్టు
UK college student energetic dance to desi dhol beats video goes  Viral

ప్రాంతం, భాష, కుల మతాలతో సంబంధం లేకుండా ఈ ప్రపంచం మొత్తాన్ని ఏకం చేయగల శక్తి ఉన్న వాటిలో సంగీతం ఒకటి. దీన్ని రుజువు చేసేందుకు బ్రిటన్ లో జరిగిన ఓ సంఘటనే  మంచి ఉదాహరణ. యూకేలోని ఓ కళాశాల సాంస్కృతిక దినోత్సవం రోజు అన్ని దేశాలకు చెందిన విద్యార్థులంతా ఒక్క చోటుకు చేరి సంబరాలు చేసుకుంటున్నారు. 

ఇందులో భాగంగా భారతీయ సంప్రదాయ సంగీత పరికరాల్లో ఒకటైన డోలు చప్పుడు మొదలైన తర్వాత ఆ విద్యార్థుల్లో ఒక్కసారిగా వంద రెట్ల హుషారు వచ్చింది. డోలు చప్పుళ్లకు అనుగుణంగా ఓ ఆంగ్ల విద్యార్థి అద్భుతంగా డ్యాన్స్ చేయడం సెంటరాఫ్ అట్రాక్షన్ అయ్యింది.

డోలు చప్పుళ్లు, వాటికి అనుగుణంగా ఆంగ్ల విద్యార్థి స్టెప్పులు చూసి తమ తమ దేశాలకు చెందిన వేషధారణల్లో ఉన్న మిగతా విద్యార్థులంతా  అతడిని చుట్టు ముట్టారు. అరుపులు, కేకలతో అతడిని ఉత్సాహపరచడంతో ఆ హాల్ మొత్తం దద్దరిల్లింది. టిక్ టాక్ లో కనిపించిన ఈ వీడియోను ఓ జర్నలిస్టు ట్విటర్లో షేర్ చేశాడు. దానికి ‘ఆధునిక బ్రిటన్’ అని క్యాప్షన్ ఇచ్చాడు. అంతే ఈ వీడియో క్షణాల్లో వైరల్ అయ్యింది. ఇప్పటికే 2.1 మిలియన్ల మంది ఆ వీడియోను చూశారు. వేలాది మంది కామెంట్లు చేస్తున్నారు.

More Telugu News