Narendra Modi: ప్రధాని మోదీ, బీజేపీ నేతల కోసం కరీంనగర్ కు చెందిన యాదమ్మ బృందంతో తెలంగాణ వంటకాలు

Telangana dishes for Modi and other BJP leaders
  • హైదరాబాదులో బీజేపీ జాతీయ సమావేశాలు
  • నగరానికి విచ్చేసిన ప్రధాని మోదీ, కేంద్రమంత్రులు
  • మెనూలో తెలంగాణ వంటకాలు
  • పర్యవేక్షించిన బండి సంజయ్
ప్రధాని నరేంద్ర మోదీ, జేపీ నడ్డా, అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్ వంటి బీజేపీ అగ్రనేతలు ఇప్పుడు హైదరాబాదులో సందడి చేస్తున్నారు. నిన్నటి నుంచి నగరంలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగుతున్నాయి. కాగా, ప్రధాని మోదీ, ఇతర బీజేపీ నేతలకు స్థానిక బీజేపీ నేతలు తెలంగాణ వంటకాలు రుచి చూపించాలని నిర్ణయించారు. ఈ మేరకు కరీంనగర్ కు చెందిన యాదమ్మ బృందంతో తెలంగాణ సంప్రదాయ వంటకాలను సిద్ధం చేయిస్తున్నారు. 

తెలంగాణ ప్రత్యేక వంటలను బీజేపీ సమావేశాల మెనూలో చేర్చారు. ఈ వంటకాలను సిద్ధం చేస్తుండగా, తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ స్వయంగా పర్యవేక్షించారు. వంటవారికి పలు సూచనలు చేశారు.
Narendra Modi
BJP
Telangana Dishes
Bandi Sanjay
Hyderabad

More Telugu News