: 'ఒక రోజు' మున్సిపల్ చైర్ పర్సన్ గా ఇంటర్మీడియట్ విద్యార్ధిని

ఇంటర్మీడియట్ విద్యార్థిని సునంద కైర్వార్ తన ప్రతిభతో మధ్యప్రదేశ్ లోని నగ్దా పట్టణ మున్సిపల్ చైర్ పర్సన్ గా ఒక రోజు విధులు నిర్వహించింది. అసలు విషయం ఏమిటంటే.. నగ్దా మునిసిపల్ చైర్ పర్సన్ శోభాయాదవ్ పట్టణ పరిధిలో ఎవరైనా రాష్ట్రస్థాయిలో ఫస్ట్ ర్యాంకు తెచ్చుకుంటే వారిని ఒక రోజు చైర్ పర్సన్ పీఠంపై కూర్చోబెడతానంటూ హామీ ఇచ్చారు. సునంద నిజంగానే ఫస్ట్ ర్యాంకు తెచ్చుకుంది. దాంతో ఆమె సునందను ఒక రోజు చైర్ పర్సన్ చేశారు. ఆ ఒక్క రోజు అంటే పోయిన మంగళవారం సునంద పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించింది. బాలికల విద్య తెలియజేస్తూ పట్టణ ప్రజలకు లేఖలు రాసింది. భవిష్యత్తులో ఐఏఎస్ అధికారి కావాలన్నది సునంద ఆశయమట.

More Telugu News