BJP: నేడు రాజ్‌భ‌వ‌న్‌లో మోదీ బ‌స‌... రాత్రంతా మూత‌ప‌డిపోనున్న రాజ్ భ‌వ‌న్ రోడ్డు

raj bhavan road closedthis night in view of modi stay at raj bhavan
  • ప‌రేడ్ గ్రౌండ్స్‌లో విజ‌య సంక‌ల్ప స‌భ‌కు హాజ‌రు కానున్న మోదీ
  • స‌భ ముగియ‌గానే రాజ్ భ‌వ‌న్‌కు రానున్న వైనం
  • శ‌నివారం రాత్రంతా రాజ్ భ‌వ‌న్ రోడ్డులో వాహ‌నాల రాక‌పోక‌ల నిలిపివేత‌
బీజేపీ జాతీయ కార్య‌వ‌ర్గ స‌మావేశాల్లో పాల్గొనేందుకు శ‌నివారం హైద‌రాబాద్ వ‌చ్చిన ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ ఆదివారం రాత్రి కూడా న‌గ‌రంలోనే బ‌స చేయ‌నున్నారు. ఆదివారం బీజేపీ జాతీయ కార్య‌వ‌ర్గ స‌మావేశాలు ముగిశాక‌... సికింద్రాబాద్ ప‌రేడ్ గ్రౌండ్స్‌లో విజ‌య సంకల్ప స‌భ పేరిట బీజేపీ తెలంగాణ శాఖ నిర్వ‌హించ‌నున్న బ‌హిరంగ స‌భ‌కు మోదీ హాజ‌ర‌వుతారు. ఈ స‌భ ముగిసిన త‌ర్వాత ప‌రేడ్ గ్రౌండ్స్ నుంచి నేరుగా ఆయ‌న రాజ్ భ‌వ‌న్ చేరుకుంటారు. రాత్రి రాజ్‌భ‌వ‌న్‌లోనే ఆయ‌న బ‌స చేయ‌నున్నారు.

రాజ్‌భ‌వ‌న్‌లో ప్ర‌ధాని బ‌స నేప‌థ్యంలో ఆ ప్రాంతంలో పోలీసులు ప‌లు అంక్ష‌ల‌ను అమ‌ల్లోకి తీసుకురానున్నారు. ప్ర‌ధాని రాజ్ భ‌వ‌న్‌కు చేరుకోవ‌డానికి కాస్తంత ముందుగానే రాజ్ భ‌వ‌న్ రోడ్డుకు మూత వేయ‌నున్నారు. ఈ రోడ్డులో వాహ‌నాల రాక‌పోక‌ల‌ను పూర్తిగా నిషేధించ‌నున్నారు. ఈ నిషేధాజ్క్ష‌లు సోమ‌వారం ఉద‌యం 8 గంట‌ల దాకా కొన‌సాగ‌నున్నాయి. సోమ‌వారం రాజ్ భ‌వ‌న్ నుంచి మోదీ బ‌య‌లుదేరిన త‌ర్వాత తిరిగి రాజ్ భ‌వ‌న్ రోడ్డుపై వాహ‌నాల రాక‌పోక‌లు కొన‌సాగ‌నున్నాయి.
BJP
Prime Minister
Narendra Modi
Hyderabad
Raj Bhavan

More Telugu News