Kerala: లైంగిక దాడి కేసులో కేరళ మాజీ ఎమ్మెల్యే పీసీ జార్జ్ అరెస్ట్

Senior Kerala politician P C George arrested for sexual harassment
  • గెస్ట్‌హౌస్‌లో తనతో అసభ్యంగా ప్రవర్తించారని మహిళ ఫిర్యాదు
  • ఆరోపణలను ఖండించిన మాజీ ఎమ్మెల్యే
  • సోలార్ ప్యానెళ్ల కుంభకోణంలో నిందితురాలిగా ఉన్న బాధిత మహిళ
అత్యాచారం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేరళకు చెందిన మాజీ ఎమ్మెల్యే పీసీ జార్జ్ (70)ను పోలీసులు అరెస్ట్ చేశారు. సోలార్ ప్యానెళ్ల కుంభకోణం కేసులో నిందితురాలైన మహిళ ఫిర్యాదు మేరకు పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి పదో తేదీన ఓ గెస్ట్‌హౌస్‌లో జార్జ్ తనతో అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా తన ఫోన్‌కు అసభ్య సందేశాలు పంపించారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో బాధిత మహిళ ఆరోపించారు. ఈ నేపథ్యంలో పోలీసులు ఆయనను అరెస్ట్ చేసి మేజిస్టీరియల్ కోర్టులో హాజరు పరిచారు. జార్జ్‌కు కోర్టు బెయిలు మంజూరు చేయడంతో ఆయన విడుదలయ్యారు.

మరోవైపు, తనపై వచ్చిన లైంగిక దాడి ఆరోపణలు జార్జ్ ఖండించారు. సోలార్ ప్యానెళ్ల కుంభకోణం కేసులో ఆమెకు మద్దతుగా స్టేట్‌మెంట్ ఇవ్వలేదన్న అక్కసుతోనే ఆమె తనపై తప్పుడు ఫిర్యాదు చేసిందన్నారు. కాగా, విద్వేషపూరిత ప్రసంగం కేసులో గతంలో అరెస్ట్ అయిన జార్జ్ రెండు నెలల క్రితమే బెయిలుపై విడుదలయ్యారు.
Kerala
PC George
Sexual Harassment

More Telugu News