డియర్ హర్షా... గర్వంగా ఉంది!: కూతురు మాస్టర్స్ డిగ్రీపై జగన్ ట్వీట్!
- పారిస్‌లో మాస్టర్స్ పూర్తి చేసిన హర్షిణి రెడ్డి
- డిస్టింక్షన్‌తో పాటు డీన్స్ జాబితాలో చోటు సాధించిన జగన్ కూతురు
- కూతురు ప్రతిభను కీర్తిస్తూ ట్వీట్ చేసిన జగన్
వైఎస్ హర్షిణి రెడ్డి పారిస్‌లోని ఇన్సీడ్ వర్సిటీలో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసిన సంగతి తెలిసిందే. శనివారం వర్సిటీలో జరిగిన స్నాతకోత్సవంలో భాగంగా మాస్టర్స్ డిగ్రీ పట్టాను హర్షిణి అందుకున్నారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు జగన్ దంపతులు పారిస్ వెళ్లిన సంగతి తెలిసిందే. పట్టా అందుకున్న కూతురుతో కలిసి జగన్ దంపతులు ఫొటో దిగారు. ఈ ఫొటోను జగన్ తన ట్వీట్‌కు జత చేశారు.