శాలువాలు, బొకేలతో సత్కారాలు చేసేందుకు రావొద్దు... సమస్యలతో రండి: జనసేన విజ్ఞప్తి
- రేపటి నుంచి జన వాణి-జనసేన భరోసా
- విజయవాడలో కార్యక్రమం
- హాజరుకానున్న పవన్ కల్యాణ్
- స్వయంగా సమస్యలు తెలుసుకోనున్న జనసేనాని
దయచేసి ఈ వేదికపై శాలువాలతో సత్కరించడం, బొకేలు ఇచ్చేందుకు సమయం వృథా చేయవద్దని సూచించింది. కేవలం సమస్యలతోనే రావాలని ఓ ప్రకటనలో పేర్కొంది. పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ప్రత్యక్షంగా ప్రజా సమస్యలు తెలుసుకుని ప్రజలకు భరోసా నింపేందుకు జన వాణి-జనసేన భరోసా కార్యక్రమం ఏర్పాటు చేశారని ఆ ప్రకటనలో వెల్లడించింది.
ఈ కార్యక్రమాన్ని కేవలం ప్రజా సమస్యల వేదికగా మలచాలని పవన్ కల్యాణ్ కోరుకుంటున్నారని జనసేన పార్టీ వివరించింది. ప్రతి ఒక్కరూ ఈ నియమాన్ని పాటించాలని విజ్ఞప్తి చేసింది.