Bill Gates: 48 ఏళ్ల క్రితం నాటి బిల్ గేట్స్ రెజ్యూమ్ చూశారా..?

  • లింక్డ్ ఇన్ లో షేర్ చేసిన మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు
  • నా రెజ్యూమ్ కంటే మీదే మెరుగ్గా ఉంటుందని పోస్ట్
  • హార్వర్డ్ కాలేజీ విద్యార్థిగా ఉన్నప్పుడు డిజైన్
Bill Gates takes trip down memory lane shares 48 year old resume on LinkedIn

విద్య తర్వాత మంచి ఉద్యోగం సంపాదించాలన్నది ఎంతో మంది స్వప్నం. అందుకోసం మంచి రెజ్యూమ్ ను వారు రూపొందించుకోవడానికి ప్రాధాన్యం ఇస్తారు. నిజానికి రెజ్యూమ్ ను ఆకర్షణీయంగా, సూటిగా తయారు చేసుకోవడం అందరికీ సాధ్య పడదు. అది కూడా ఒక కళే.  కొంత అనుభవం కూడా కావాలి. అటువంటిది ప్రపంచ కుబేరుల్లో ఒకరు, దిగ్గజ కంపెనీ మైక్రోసాఫ్ట్ ను ప్రపంచానికి అందించిన దాని వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ తాను విద్యార్థి దశలో రూపొందించుకున్న రెజ్యూమ్ ఎలా ఉండేదో ఊహించుకోండి? 

48 ఏళ్ల క్రితం నాటి తన రెజ్యూమ్ ను స్వయంగా బిల్ గేట్స్ ‘లింక్డ్ ఇన్’లో షేర్ చేశారు. ‘‘మీరు ఇటీవలే గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండొచ్చు. లేదా కాలేజీ డ్రాపవుట్స్ కావచ్చు. 48 ఏళ్ల క్రితం నాటి నా రెజ్యూమ్ కంటే మీ రెజ్యూమ్ మెరుగ్గా ఉంటుందని నేను కచ్చితంగా చెప్పగలను’’అని బిల్ గేట్స్ పోస్ట్ పెట్టారు.

ఈ రెజ్యూమ్ రూపొందించుకునే నాటికి బిల్ గేట్స్ హార్వర్డ్ కాలేజీలో ఫస్ట్ ఇయర్ కోర్సులో ఉన్నారు. రెజ్యూమ్ ను పరిశీలిస్తే అందులో బిల్ గేట్స్ చేసిన కోర్సుల వివరాలు కనిపిస్తాయి. ఆపరేటింగ్ సిస్టమ్స్ స్ట్రక్చర్, డేటా బేస్ మేనేజ్ మెంట్, కంపైలర్ కన్ స్ట్రక్షన్, కంప్యూటర్ గ్రాఫిక్స్ కోర్సులు చేసినట్టుగా అందులో ఉంది. బిల్ గేట్స్ పూర్తి పేరు అయిన విలియం హెన్రీ గేట్స్ కూడా కనిపిస్తుంది. దీనికి నెటిజన్ల నుంచి స్పందన అమితంగా వస్తోంది. 

More Telugu News