google chrome: క్రోమ్ లో పాస్ వర్డ్ లు సేవ్ చేసుకుంటే.. ఆటోమేటిగ్గా లాగిన్

  • ప్రతిసారీ లాగిన్ వివరాలు ఇవ్వక్కర్లేదు
  • గుర్తుంచుకోవాల్సిన శ్రమ కూడా తప్పుతుంది
  • మ్యాన్యువల్ గా నమోదు చేసుకునే ఆప్షన్
How to manually add passwords in Chrome Password manager

అంతా డిజిటల్ మయం అయిపోతున్న క్రమంలో.. ప్రతీ అకౌంట్ కు సంబంధించి లాగిన్ యూజర్ నేమ్, పాస్ వర్డ్ లను గుర్తు పెట్టుకోవడం కష్టంగా ఉంటోంది. ఈ సమస్యకు ఒక సులభ పరిష్కారం ఉంది. అదే గూగుల్ క్రోమ్ బిల్ట్ ఇన్ పాస్ వర్డ్ మేనేజర్ టూల్. ఇందులో ఒక్కసారి యూజర్ నేమ్, పాస్ వర్డ్ నమోదు చేసుకుంటే.. ప్రతీ సారి లాగిన్ వివరాలు ఎంటర్ చేయాల్సిన శ్రమ తప్పుతుంది.

క్రోమ్ బ్రౌజర్ లో మ్యాన్యువల్ గా ఈ వివరాలను నమోదు చేసుకోవచ్చు. డెస్క్ టాప్ వెర్షన్ ఇప్పటికే అందుబాటులో ఉండగా, ఆండ్రాయిడ్ వెర్షన్ ను సైతం గూగుల్ అందుబాటులోకి తీసుకొచ్చింది. క్రోమ్ పాస్ వర్డ్ మేనేజర్ లో సేవ్ పాస్ వర్డ్స్ కు వెళ్లాలి. 

ముందుగా యూజర్లు తమ ఆండ్రాయిడ్ ఫోన్ లోని గూగుల్ క్రోమ్ ను అప్ డేట్ చేసుకోవాలి. క్రోమ్ ఓపెన్ చేయాలి. పై భాగంలో కుడి చేతి వైపు మూలన ట్యాప్ చేస్తే కొన్ని ఆప్షన్లు కనిపిస్తాయి. అందులో సెట్టింగ్స్  ను సెలక్ట్ చేసుకోవాలి. అందులో పాస్ వర్డ్ ను సెలక్ట్ చేసుకోవాలి. అక్కడ యాడ్ బటన్ ను ట్యాప్ చేయాలి. అక్కడ వెబ్ సైట్ యూఆర్ఎల్, యూజర్ నేమ్, పాస్ వర్డ్ ను నమోదు చేసి సేవ్ కొట్టాలి. 

ఒకవేళ డెస్క్ టాప్ క్రోమ్ వెర్షన్ అయితే.. గూగుల్ క్రోమ్ బ్రౌజర్ తెరవాలి. సెట్టింగ్స్ లో, పాస్ వర్డ్స్ ను ఎంపిక చేసుకోవాలి. యాడ్ పాస్ వర్డ్స్ బటన్ ను ట్యాప్ చేయాలి. అక్కడ కొత్త పాపప్ విండో తెరుచుకుంటుంది. దానిపై లాగిన్ వివరాలను నమోదు చేయాలి. తర్వాత సేవ్ చేస్తే పూర్తయినట్టే.

More Telugu News