Ram: దూసుకుపోతున్న 'ది వారియర్' ట్రైలర్!

  • రామ్ తాజా చిత్రంగా 'ది వారియర్'
  • కథానాయికగా కనిపించనున్న కృతి శెట్టి
  • పవర్ఫుల్ ప్రతినాయకుడిగా ఆది పినిశెట్టి 
  • ఈ నెల 14వ తేదీన సినిమా విడుదల  
The Warrior Movie Update

రామ్ హీరోగా తమిళ దర్శకుడు లింగుసామి 'ది వారియర్' సినిమాను రూపొందించాడు. శ్రీనివాస చిట్టూరి నిర్మించిన ఈ సినిమాను, ఈ నెల 14వ తేదీన తెలుగు .. తమిళ భాషల్లో థియేటర్లలో రిలీజ్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో నిన్న రాత్రి ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. ఈ వేదిక ద్వారా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. 
 
తెలుగు ట్రైలర్ ను బోయపాటి  విడుదల చేయగా .. తమిళ ట్రైలర్ ను హీరో శివకార్తికేయన్ డిజిటల్ రిలీజ్ చేశారు. ఈ రెండు భాషలకి సంబంధించిన ట్రైలర్స్ యూట్యూబ్ లో ఒక రేంజ్ లో దూసుకుపోతున్నాయి. రెండు భాషల్లోని ట్రైలర్స్ కి ఇంతవరకూ 2.5  మిలియన్ ప్లస్ వ్యూస్ రావడం విశేషం. 


రామ్ పోలీస్ ఆఫీసర్ గా నటించిన ఈ సినిమాలో ఆయన సరసన కథానాయికగా కృతి శెట్టి అలరించనుంది. ప్రతినాయకుడిగా ఆది పినిశెట్టి కనిపించనున్నాడు. కీలకమైన పాత్రలో నదియా నటించింది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ఈ సినిమాకి  హైలైట్ గా నిలుస్తుందనే విషయం, ఇప్పటికే విడుదలైన పాటలను బట్టి అర్థమవుతోంది

More Telugu News