Konaseema: కోనసీమలో తల్లీకూతుళ్ల సజీవదహనం

Mother and daughter dead in fire accident in Konaseema
  • అల్లవరం మండలం కొమ్మరగిరిపట్నంలో విషాదకర ఘటన
  • తెల్లవారుజామున చోటుచేసుకున్న అగ్నిప్రమాదం
  • ఐదు నెలల క్రితమే ప్రేమ వివాహం చేసుకున్న మృతురాలు జ్యోతి
అంబేద్కర్ కోనసీమ జిల్లాలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. అల్లవరం మండలం కొమ్మరగిరిపట్నం ఆకులవారి వీధిలో అగ్నిప్రమాదం జరిగింది. తెల్లవారుజామున 4 గంటల సమయంలో జరిగిన అగ్నిప్రమాదంలో తల్లీకూతుళ్లు సజీవదహనం అయ్యారు. మృతులు సాధనాల మంగాదేవి (40), మెడిశెట్టి జ్యోతి (23)గా గుర్తించారు. ఐదు నెలల క్రితమే మెడిశెట్టి జ్యోతి ప్రేమ వివాహం చేసుకుంది. ఆమె ప్రస్తుతం గర్భవతి అని చెపుతున్నారు. 

మరోవైపు వీరి మరణాలపై బంధువులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఒక కుట్ర ప్రకారమే ఇది జరిగిందని అంటున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తల్లీకూతుళ్లు సజీవదహనమైన ఘటనతో స్థానికంగా విషాదకర పరిస్థితులు నెలకొన్నాయి.
Konaseema
Mother
Daughter
Fire Accident

More Telugu News